Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ చేసిన సినిమా ఆచార్య. షూటింగ్ పూర్తయిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో అందులోని కాజల్ సీన్లను కట్ చేశారు.
అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెడుతోంది కాజల్ అగర్వాల్. తాజాగా కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయిందని.. షూటింగ్ కు కూడా వెళ్లబోతున్నానని అఫిషియల్ గా పోస్ట్ చేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ ను ఈ సినిమా నుంచి తప్పించినట్లు కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దానికి కారణం.. కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 సినిమాకి పెళ్లికి ముందే సైన్ చేసింది. ఆ టైంలో అమ్ముడు చాలా హాట్ గా లుక్స్ తో అభిమానులను మెప్పించే విధంగా ఉంది. కానీ ప్రస్తుతం కాజల్ అగర్వాల్ లుక్స్ పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు.
డెలివరీ అయిన తరువాత కాజల్ తన బాడీని కరెక్ట్ షేపులో పెట్టడానికి ఇంకా శ్రమిస్తూనే ఉంది. కానీ అంత టైం ఇండియన్ 2 డైరెక్టర్స్ ఆమెకు ఇవ్వట్లేదని సమాచారం. ఈ క్రమంలోనే కాజల్ ను ఈ సినిమా నుంచి తప్పించి మరో యంగ్ బ్యూటీని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నారట. దీంతో కాజల్ సైన్ చేసిన సినిమా నుండి మళ్లీ తప్పుకోవాల్సి వచ్చింది అంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్ 2 మూవీ షూటింగ్ కొంత పూర్తి చేసుకున్నాక వాయిదా పడి మళ్లీ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే కాజల్ ను హీరోయిన్ గా తప్పిస్తున్న విషయంలో నిజం ఎంతుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…