Kajal Aggarwal : కాజల్ అగ‌ర్వాల్‌కు మ‌ళ్లీ షాక్‌.. ఈసారి ఇంకో సినిమా నుంచి అవుట్‌..?

August 29, 2022 12:06 PM

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ చేసిన సినిమా ఆచార్య. షూటింగ్ పూర్తయిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో అందులోని కాజల్ సీన్లను కట్ చేశారు.

అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెడుతోంది కాజల్ అగర్వాల్. తాజాగా కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయిందని.. షూటింగ్ కు కూడా వెళ్లబోతున్నానని అఫిషియల్ గా పోస్ట్ చేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ ను ఈ సినిమా నుంచి తప్పించినట్లు కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దానికి కారణం.. కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 సినిమాకి పెళ్లికి ముందే సైన్ చేసింది. ఆ టైంలో అమ్ముడు చాలా హాట్ గా లుక్స్ తో అభిమానులను మెప్పించే విధంగా ఉంది. కానీ ప్రస్తుతం కాజల్ అగర్వాల్ లుక్స్ పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు.

Kajal Aggarwal yet again removed from another movie
Kajal Aggarwal

డెలివరీ అయిన తరువాత కాజల్ తన బాడీని కరెక్ట్ షేపులో పెట్టడానికి ఇంకా శ్రమిస్తూనే ఉంది. కానీ అంత టైం ఇండియన్ 2 డైరెక్టర్స్ ఆమెకు ఇవ్వట్లేదని సమాచారం. ఈ క్రమంలోనే కాజల్ ను ఈ సినిమా నుంచి తప్పించి మరో యంగ్ బ్యూటీని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నారట. దీంతో కాజల్ సైన్ చేసిన సినిమా నుండి మళ్లీ తప్పుకోవాల్సి వచ్చింది అంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్ 2 మూవీ షూటింగ్ కొంత పూర్తి చేసుకున్నాక వాయిదా పడి మళ్లీ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే కాజల్ ను హీరోయిన్ గా తప్పిస్తున్న విషయంలో నిజం ఎంతుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now