Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు అటు పొలిటికల్‌గా, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ ఇమేజ్ ఉన్న తారక్‌కి బీజేపీ అగ్రనేతలతో ఏంటీ సంబంధం అనే చర్చ జరుగుతోంది. ఏపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంటే కొడాలి నానికి ప్రత్యేకమైన అభిమానం. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కొడాలి, వల్లభనేని వంశీ ఫ్రెండ్‌షిప్ గురించి అప్పట్లో అందరూ చెప్పుకునేవారు.
ఇక అప్పుడప్పుడూ ఎన్టీఆర్ సినిమా సెట్‌లో నాని, వంశీ సందడి చేసేవారు. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ తో కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు. కొన్ని కారణాల వల్ల విభేదాలు తలెత్తి వీరు విడిపోయారు. అయితే ఇటీవల ఎన్టీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎలాంటి ఉపయోగం లేకపోతే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవరినీ కలవరని కొడాలి నాని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ పిక్ చూసి అభిమానులు, నెటిజన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లైక్స్, షేర్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
అందులో కొడాలి నాని మధ్యలో కూర్చుని సీరియస్‌గా పుస్తకంలో ఏదో చూస్తుండగా.. ఎన్టీఆర్ నవ్వుతూ నాని కాలిపై కాలు వేసి కూర్చున్నారు. అలాగే మరోవైపు వల్లభనేని వంశీ సైతం నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటో సుబ్బు సినిమా షూటింగ్ గ్యాప్‌లో తీసిన ఫోటోలా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని, ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారో ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. రాజకీయం ఎంతటి మిత్రుల మధ్యనైనా వైరం పెంచుతుంది. ఇప్పుడు వీరిద్దరూ చెరో దారిలో వెళ్తున్నారు. ప్రస్తుతం తారక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…