Kaikala Satyanarayana : కైకాల స‌త్య‌నారాయ‌ణ ద‌శ తిరిగింది ఆ సినిమాతోనే..!

Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ  టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 750 కి పైగా సినిమాలు చేసి తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ గొప్ప న‌టుడు అనే చెప్పాలి.  విలన్ గా, తండ్రిగా, తాతగా వివిధ రకాల పాత్రలలో త‌న అద్బుత‌మైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, క‌న్న‌డ‌ భాషల చిత్రాలలో కూడా న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కైకాల కెరీర్ ప్రారంభంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ కి డూప్ గా నటించేవారు. ఎన్టీఆర్ ద్వి పాత్రాభిన‌యంలో కనిపించిన చాలా సినిమాల్లో స‌త్యనారాయ‌ణ న‌టించారు.

కైకాల స‌త్య‌నారాయ‌ణలో మంచి న‌టుడు ఉన్నాడని గుర్తించి ఎన్టీఆర్ అపూర్వ స‌హ‌స్ర స‌చ్ఛ‌రిత్ర అనే సినిమాలో స‌త్య‌నారాయ‌ణ‌కు ఓ పాత్రలో అవకాశం ఇప్పించారు. ఇక అప్ప‌టి నుంచి త‌న న‌ట‌న‌తో కైకాల సత్యనారాయణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీ‌కృష్ణార్జున యుద్ధంలో క‌ర్ణుడిగా, ల‌వ‌కుశ‌లో భ‌ర‌తుడిగా, న‌ర్త‌న‌శాల‌లో దుశ్సాస‌నుడిగా, శ్రీ‌కృష్ణ పాండ‌వీయం సినిమాలో ఘ‌టోత్క‌చుడిగా, య‌మ‌లీల చిత్రంలో య‌ముడిగా విభిన్న‌మైన పౌరాణిక పాత్ర‌ల్లో న‌టించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Kaikala Satyanarayana

కైకల సత్యనారాయణ  1935 సంవత్సరం 25 జులై లో కృష్ణాజిల్లాలోని కవుతారం అనే గ్రామంలో జన్మించారు. ఆయన స్కూల్ చదువును గుడ్లవల్లేరు అనే గ్రామంలో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ చదువును విజయవాడలో మరియు గ్రాడ్యుయేషన్ ను గుడివాడ కాలేజీ నుంచి పూర్తి చేశారు. వీరి వంశంలో మొట్టమొదటి సారి డిగ్రీ సంపాదించిన వ్యక్తి సత్యనారాయణ మాత్రమే. ఎన్టీఆర్ తో 1977లో అడ‌విరాముడు సినిమాలో న‌టించ‌డ‌మే కాకుండా ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అడవిరాముడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 కైకాల సత్యనారాయణ య‌మ‌ధ‌ర్మ‌రాజు పాత్ర‌లో ఎంతో అద్భుతంగా నటిస్తారు. నిజానికి యముడంటే ఇలాగే ఉంటాడు అనే విధంగా ఉంటుంది సత్యనారాయణ నటన. యుముడి పాత్ర‌లో కైకాల యమగోల, య‌ముడికి మొగుడు, య‌మ‌లీల వంటి సినిమాల్లో అద్బుత‌మైన న‌ట‌నతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కైకాల స‌త్యానారాయ‌ణ శ్రీ‌కాంత్ హీరోగా య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ద‌రువు సినిమాల్లో సీనియ‌ర్ య‌ముడిగా కనిపించారు. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమాలో ఒక చిన్న అతిథి పాత్ర‌లో న‌టించారు. బాల‌కృష్ణ కోరిక మేర‌కు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హెచ్.ఎం.రెడ్డి పాత్ర‌లో కనిపించారు. అంతేకాకుండా కైకాల సత్యనారాయణ  కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 సినిమాకి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM