Juhi Chawla : బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దాదాపుగా నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన అతను బెయిల్‌పై బయటకు రాబోతున్నాడు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన తర్వాత, షారూఖ్ ఖాన్ కళ్ళలో ఆనందభాష్పాలు కనిపించాయని ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు.
అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో నటి జూహీ చావ్లా ముఖ్య పాత్ర పోషించింది. ఆర్యన్‌కు బెయిల్ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చింది. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్ కోర్టుకు వెళ్లింది. ఆర్యన్ బెయిల్ పూర్తి బాధ్యత తనదేనంటూ లక్ష రూపాయల బాండ్ పేపర్‌పై సంతకం చేసింది. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పుడు ఆర్యన్ బయటకు రావడం ముఖ్యం. అదే పదివేలు’ అని పేర్కొంది జూహీ చావ్లా.
ఈ కేసులో ఆర్యన్ డబ్బు చెల్లించడంలో విఫలమైనా, అతడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దీనికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎన్నో సినిమాలలో జూహీ, షారూఖ్ కలిసి నటించగా ప్రస్తుతం ఐపీఎల్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తమ కుమారుడు ఆర్యన్‌ఖాన్ జైలు నుంచి విడుదల కానున్న సందర్భంగా షారుఖ్, గౌరీ ఖాన్‌ల ముంబైలోని నివాసం ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదల కానున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…