గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Juhi Chawla : ఆర్య‌న్ బెయిల్‌కి పూర్తి బాధ్య‌త నాదేనంటూ సంత‌కం చేసిన జూహీ చావ్లా..

Juhi Chawla : బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. దాదాపుగా నెల రోజుల పాటు జైలు జీవితం గ‌డిపిన అతను బెయిల్‌పై బ‌య‌ట‌కు రాబోతున్నాడు.…

Juhi Chawla : ఆర్య‌న్ బెయిల్‌కి పూర్తి బాధ్య‌త నాదేనంటూ సంత‌కం చేసిన జూహీ చావ్లా..

Juhi Chawla : బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. దాదాపుగా నెల రోజుల పాటు జైలు జీవితం గ‌డిపిన అతను బెయిల్‌పై బ‌య‌ట‌కు రాబోతున్నాడు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన తర్వాత, షారూఖ్ ఖాన్ కళ్ళలో ఆనందభాష్పాలు కనిపించాయని ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు.

Juhi Chawla took responsibility of aryan khan bail fee

అయితే ఆర్య‌న్ ఖాన్ బెయిల్ విష‌యంలో న‌టి జూహీ చావ్లా ముఖ్య పాత్ర పోషించింది. ఆర్యన్‌కు బెయిల్ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చింది. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్‌ కోర్టుకు వెళ్లింది. ఆర్య‌న్ బెయిల్ పూర్తి బాధ్య‌త త‌న‌దేనంటూ ల‌క్ష రూపాయ‌ల బాండ్ పేప‌ర్‌పై సంత‌కం చేసింది. అనంత‌రం మాట్లాడుతూ.. ఇప్పుడు ఆర్యన్‌ బయటకు రావడం ముఖ్యం. అదే పదివేలు’ అని పేర్కొంది జూహీ చావ్లా.

ఈ కేసులో ఆర్యన్‌ డబ్బు చెల్లించడంలో విఫలమైనా, అతడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దీనికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎన్నో సినిమాలలో జూహీ, షారూఖ్ క‌లిసి న‌టించ‌గా ప్ర‌స్తుతం ఐపీఎల్‌ టీం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తమ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ జైలు నుంచి విడుదల కానున్న సందర్భంగా షారుఖ్, గౌరీ ఖాన్‌ల ముంబైలోని నివాసం ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదల కానున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి