Jr NTR : సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మొదటి సినిమా మిర్చి దగ్గర నుంచి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలో సామాజిక అంశాన్ని టచ్ చేశారు. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కట్ చేస్తే.. ఆచార్య ఇటు డైరెక్టర్ కెరీర్ లో హీరో చిరు కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.
ఆచార్య ఫెయిల్యూర్ నుంచి చిరు ఇంకా కోలుకున్నట్టు లేడు. ఆచార్య డిజప్పాయింట్ చేశాక చిరు ఎంచుకున్న ప్రాజెక్టులు ఆయన ఫ్యాన్స్‌కే నచ్చడం లేదు. ఏదేమైనా ఆచార్య చిరు ఇమేజ్‌కు బాగా డ్యామేజ్ చేసింది. ఇటీవల ఒకటి రెండు ఫంక్షన్లలో ఆచార్య ఫలితంతోపాటు ఆ సినిమా డైరెక్టర్ కొరటాల శివపై అసహనం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. మొన్న ఓ ప్రీలీజ్ ఈవెంట్లో చిరు మాట్లాడుతూ డైరెక్టర్లకు కొన్ని సలహాలు ఇచ్చారు. డైరెక్టర్లు సరిగా లేకపోతే ఫ్లాప్స్ వస్తాయని.. అందుకు తన సినిమానే ఉదాహరణ అని చెప్పారు. చిరు అన్నది ఆచార్య సినిమాను ఉద్దేశించే అని.. అది కూడా కొరటాలనే ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారన్న చర్చ కూడా జరిగింది.
ఈ క్రమంలో కొరటాలకు అత్యంత సన్నిహితుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కొరటాలకు సపోర్ట్ గా చిరుకు కౌంటర్ ఇచ్చారంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. తాజాగా బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమా ఒత్తిడికి లోనవుతోంది. ప్రేక్షకులు ఏదో కొత్తగా కావాలని కోరుకుంటున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకుని తన వరకు తాను బాగా నటించాలని కోరుకుంటానని.. ఈ ఒత్తిడిని ఇండస్ట్రీ ఓ ఛాలెంజింగ్‌గా స్వీకరించాలి.. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి.. ఇది అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని తారక్ అన్నాడు.
అయితే ఎన్టీఆర్ కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొరటాలకు సపోర్ట్‌గానే ఎన్టీఆర్ ఇలా మాట్లాడాడు అని.. ఇండస్ట్రీయే ఒత్తిడిలో ఉంది.. దీనికి ఏ ఒక్కరు కారణం కాదు.. ఏ ఒక్కరినీ నిందించాలనుకోవడం కరెక్ట్ కాదు.. ఇప్పుడు అందరూ అప్‌డేట్ అవ్వాలని చెప్పడంతో చిరుకు ఎన్టీఆర్ పరోక్షంగా పంచ్ ఇచ్చారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ నిజంగానే చిరు వ్యాఖ్యలకు పరోక్షంగా అలా మాట్లాడారా ? లేక జనరల్ గానే అలా అన్నారా.. అని తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…