Jr. NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చరణ్‌తో కలసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ అనంతరం కొద్ది రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లిన ఎన్‌టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. కొరటాల శివతో చేయనున్న సినిమాకు గాను ఇప్పటికే పోస్టర్ అప్‌డేట్ వచ్చింది. కానీ మిగిలిన వివరాలు ఏవీ తెలియలేదు. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఎన్‌టీఆర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భార్య, పిల్లలతో మాత్రం కచ్చితంగా గడుపుతుంటారు. కాస్త విరామం లభిస్తే చాలు.. ఆయన ఎక్కువగా ఫ్యామిలీతోనే సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్‌టీఆర్‌కు తన ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన కుటుంబ సభ్యులను ఆయన ప్రస్తుతానికైతే మీడియాకు దూరంగానే ఉంచుతున్నారు. ఏదైనా ప్రత్యేకమైన సందర్భం అయితే తప్ప వారు అంతగా బయట కనిపించరు.
ఇక తాజాగా ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి చిల్ అవుతున్న ఫొటోను షేర్ చేశారు. సాధారణంగా ఎన్‌టీఆర్ ఇలాంటి ఫొటోలను షేర్ చేయరు. కానీ ఇప్పుడు షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆ ఇద్దరినీ చూసి మురిసిపోతున్నారు. ఇక ఎన్‌టీఆర్, లక్ష్మీ ప్రణతి ఉన్న ప్లేస్ వారి ఫామ్ హౌస్ కాగా.. ఇటీవలే ఆమె జన్మదినం సందర్భంగా ఆయన దాన్ని ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఆ ఫామ్ హౌస్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక ఆయన భార్యతో గడుపుతున్న ఆ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఆ ఫొటోకు తెగ లైక్‌లు కొడుతున్నారు.
కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. త్వరలోనే కొరటాల శివతో నటించనున్న ఎన్టీఆర్ 30 మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 31 మొదలు కానుంది. దీంతో ఈ రెండు మూవీల అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…