Jr. NTR : భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో ఎన్‌టీఆర్‌.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

August 2, 2022 11:45 AM

Jr. NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. చ‌ర‌ణ్‌తో క‌ల‌సి న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. ఇక ఈ మూవీ అనంత‌రం కొద్ది రోజుల పాటు వెకేష‌న్‌కు వెళ్లిన ఎన్‌టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో న‌టిస్తూ త‌న అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌నున్నారు. కొర‌టాల శివ‌తో చేయ‌నున్న సినిమాకు గాను ఇప్ప‌టికే పోస్ట‌ర్ అప్‌డేట్ వ‌చ్చింది. కానీ మిగిలిన వివ‌రాలు ఏవీ తెలియ‌లేదు. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఎన్‌టీఆర్ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న భార్య, పిల్ల‌ల‌తో మాత్రం క‌చ్చితంగా గ‌డుపుతుంటారు. కాస్త విరామం ల‌భిస్తే చాలు.. ఆయ‌న ఎక్కువ‌గా ఫ్యామిలీతోనే స‌ర‌దాగా గ‌డుపుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఎన్‌టీఆర్‌కు త‌న ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణ‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న ప్ర‌స్తుతానికైతే మీడియాకు దూరంగానే ఉంచుతున్నారు. ఏదైనా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం అయితే త‌ప్ప వారు అంత‌గా బ‌య‌ట క‌నిపించ‌రు.

Jr. NTR at his farmhouse with his wife Lakshmi Pranathi
Jr. NTR

ఇక తాజాగా ఎన్టీఆర్ త‌న స‌తీమ‌ణి లక్ష్మీ ప్ర‌ణ‌తితో క‌లిసి చిల్ అవుతున్న ఫొటోను షేర్ చేశారు. సాధార‌ణంగా ఎన్‌టీఆర్ ఇలాంటి ఫొటోల‌ను షేర్ చేయ‌రు. కానీ ఇప్పుడు షేర్ చేశారు. దీంతో ఆయ‌న అభిమానులు ఆ ఇద్ద‌రినీ చూసి మురిసిపోతున్నారు. ఇక ఎన్‌టీఆర్‌, ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఉన్న ప్లేస్ వారి ఫామ్ హౌస్ కాగా.. ఇటీవ‌లే ఆమె జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న దాన్ని ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఆ ఫామ్ హౌస్ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక ఆయన భార్య‌తో గ‌డుపుతున్న ఆ ఫొటో కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఆ ఫొటోకు తెగ లైక్‌లు కొడుతున్నారు.

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. త్వరలోనే కొరటాల శివతో నటించనున్న ఎన్టీఆర్ 30 మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 31 మొదలు కానుంది. దీంతో ఈ రెండు మూవీల అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment