Akshay : నాగార్జున సంతోషం మూవీ బాలుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?

Akshay : అక్కినేని నాగార్జున, కె.దశరథ్ ల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ.. సంతోషం. ఈ మూవీ ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. టీవీల్లో ఈ చిత్రం వచ్చినప్పుడల్లా ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఈ మూవీకి మంచి టీఆర్‌పీ రేటింగ్స్‌ కూడా వస్తుంటాయి. 2002లో రిలీజ్‌ అయిన ఈ మూవీలో అక్కినేని నాగార్జునకు జోడీగా గ్రేసీ సింగ్‌ నటించగా.. శ్రియ మరో కీలకపాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఎమోషన్లతో సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలోని ప్రతి క్యారెక్టర్‌ కూడా ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టిస్తుంది.

ఇక ఇందులో నాగార్జునకు కొడుకుగా నటించిన బాలుడు కూడా అందరికీ తెలుసు. బొద్దుగా ఉండేవాడు. క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ డైలాగ్స్‌ చెప్పాడు. అయితే ఆ బాలుడి పేరు.. అక్షయ్‌ బచ్చు. అక్షయ్‌ హిందీలో పలు మూవీల్లో నటించాడు. అదే సమయంలో అక్షయ్‌ యాక్టింగ్‌ చూసిన నాగార్జున తన సినిమాలో తన కొడుకుగా నటించే అవకాశాన్ని ఇచ్చారు. ఇక సంతోషం మూవీలోనూ అక్షయ్‌ నటించి అలరించాడు.

Akshay

 

సంతోషం మూవీ అనంతరం తెలుగులో ప్రభాస్‌, త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కిన వర్షం మూవీలోనూ నటించాడు. అయితే కొంతకాలం పాటు విద్యాభ్యాసం కొనసాగించిన అక్షయ్‌ తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు. కానీ హిందీలో మాత్రం పలు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఇతను బాలీవుడ్‌లోనే సెటిల్‌ అయ్యాడు. ఇప్పటికే 12 సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఇతను 45కి పైగా యాడ్స్‌లోనూ నటించాడు. ఈ క్రమంలోనే ఇతనికి సోషల్‌ మీడియాలో సైతం ఫాలోవర్లు ఎక్కువగానే ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM