Jeevitha : సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న విషయం విదితమే. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజశేఖర్ భిన్నమైన పాత్రలో నటించారు. ఇక ఈ మూవీకి చెందిన ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఇటీవలే నిర్వహించారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ ను వేగంగా చేస్తున్నారు. అందులో భాగంగానే రాజశేఖర్ సతీమణి జీవిత, వారి కుమార్తెలు శివాని, శివాత్మికలు మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వారు పలు కీలక విషయాలను పంచుకున్నారు.
ఇటీవల గరుడ వేగ సినిమాకు సంబంంధించి నిర్మాతలు జీవిత రాజశేఖర్ పై ఫిర్యాదు చేయగా.. వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జీవిత స్పందించారు. గరుడ వేగ చిత్రానికి నిర్మాత కొంత వరకే ఖర్చు చేశారని.. మిగిలిన మొత్తాన్ని తాము తమ ఆస్తులను అమ్మి ఖర్చు పెట్టామని.. అయితే వచ్చిన లాభాలను మాత్రం నిర్మాతనే తీసుకున్నారని అన్నారు. ఇక ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తుందని.. కనుక నిజా నిజాలు త్వరలోనే తెలుస్తాయని అన్నారు. అసలు విషయం తెలియకుండా కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ చానల్స్ తమపై తప్పుడు ప్రచారం చేశాయని.. నిజానిజాలు తెలుసుకుని వార్తలను ప్రసారం చేయాలని అన్నారు.
ఇక తాము తమ కుమార్తెలతో కలిసి దుబాయ్‌కి వెళితే.. ఒకసారి శివాని, ఒకసారి శివాత్మికల పేర్లు పెట్టి తమ కుమార్తెలు బాయ్ ఫ్రెండ్స్‌తో లేచి వెళ్లిపోయారని వార్తలు రాశారని.. జీవిత భావోద్వేగం అయ్యారు. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దని.. యూట్యూబ్ లో ఇలాంటి వార్తలపై వీడియోలు కూడా పెట్టొద్దని ఆమె కోరారు. వీటిపై తాము పరువు నష్టం దావా వేయవచ్చని.. కానీ తాము ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయి ఉన్నామని.. కనుక తమ పరువుకు భంగం కలిగించే పనులు చేయొద్దని.. జీవిత కోరారు.
కాగా శేఖర్ చిత్రానికి జీవిత దర్శకత్వం వహించగా.. వారి కుమార్తెలు శివాని, శివాత్మికలు స్వయంగా దగ్గరుండి.. ప్రొడక్షన్, స్క్రిప్ట్, రీ రికార్డింగ్ పనులు చూసుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తమ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని.. టిక్కెట్ల రేట్లను మాత్రం పెంచడం లేదని.. జీవిత స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…