OTT : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాకు ఎంత పవర్ ఉందో మనందరికీ తెలుసు. సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించాలే కానీ.. ప్రభుత్వాలే దిగి వస్తాయి. ఇలాంటి సంఘటనలను మనం గతంలో చూశాం. ఇక ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకు ఓటీటీలు అబ్బా.. అంటున్నాయి. అవును.. నిజంగా ఇది నెటిజన్లు సాధించిన విజయంగానే చెప్పుకోవచ్చు. అసలే థియేటర్లలో టిక్కెట్ల రేట్లు పెరిగి అక్కడకు వెళ్లలేక ఓటీటీల్లో చూసేందుకు ఆసక్తిని చూపిస్తుంటే.. ఇక్కడ కూడా ఓవైపు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా.. ఠాఠ్.. పే పర్ వ్యూ లెక్కన రూ.199 చెల్లించి మరీ సినిమా చూడాల్సిందే.. అంటే.. ఎలా.. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఈ క్రమంలోనే ఈ సెగ జీ5 కు బాగానే తగిలినట్లు ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీని చూసేందుకు ఎలాంటి రుసుము అవసరం లేదని తెలియజేసింది. దీంతో ప్రేక్షకులకు భారీ ఊరట లభించింది.
ఆర్ఆర్ఆర్ మూవీ జీ5లో ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమ్ కానున్న విషయం విదితమే. అయితే దీన్ని చూడాలంటే.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా సరే.. రూ.199 చెల్లించి పే పర్ వ్యూ పద్ధతిలో ఈ మూవీని చూడాలని జీ5 కండిషన్ పెట్టింది. దీంతో అటు అమెజాన్ ప్రైమ్ కూడా కేజీఎఫ్ 2కు ఇలాంటి దిక్కుమాలిన కండిషన్ నే పెట్టింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రేక్షకులు ఈ రెండు ఓటీటీ యాప్‌లను భారీగా ట్రోల్ చేస్తూ విమర్శించారు. ఓవైపు ఏడాదికో.. ఆరు నెలలకో లేదా నెలకో అని చెప్పి అధికంగా ఖర్చు చేసి ఆయా ఓటీటీ యాప్‌లలో సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకున్నాం కదా.. మళ్లీ సినిమాలను చూసేందుకు డబ్బులు కట్టమంటారేంటి ? అని సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఆయా ఓటీటీ యాప్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు కొన్ని సైట్లలో ఇప్పటికే ఆ మూవీలకు చెందిన హెచ్‌డీ ప్రింట్‌లను కూడా వదిలారు. దీంతో మొదటికే మోసం వస్తుందని.. జనాలు అందరూ పైరసీ చూసేలా ఉన్నారని భావించిన జీ5 తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆర్ఆర్ఆర్‌ను ఉచితంగానే చూడవచ్చని.. అయితే తమ యాప్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే ఈ మూవీని ఉచితంగా చూడగలరని తెలియజేసింది. దీంతో ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కచ్చితంగా ఇది సోషల్ మీడియా సాధించిన ఘన విజయం అనే చెప్పవచ్చు.
ఇక మే 20వ తేదీన ఆర్ఆర్ఆర్‌తోపాటు పలు ఇతర సినిమాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. కేజీఎఫ్ 2, ఆచార్య, భళా తందనాన వంటి మూవీలను శుక్రవారం నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఇక మోహన్ లాల్ నటించిన ట్వెల్త్ మ్యాన్ అనే మూవీ నేరుగా ఓటీటీలోనే 20వ తేదీన రిలీజ్ అవుతోంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…