Janhvi Kapoor : అలాంటి డ్రెస్ ధ‌రించిన జాన్వీ క‌పూర్‌.. పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్న నెటిజ‌న్లు..

April 8, 2022 11:18 AM

Janhvi Kapoor : అందాల సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సినిమాల క‌న్నా గ్లామ‌ర్ షోతోనే తెగ వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్ లో జాన్వీ ఫోజులకు కుర్రాళ్లు చిత్తవుతున్నారు. చూపు తిప్పుకోనివ్వకుండా నెటిజన్ల కళ్లకు అడ్డుపడుతోంది జాన్వీ అందం. స్టార్ కిడ్ గా జాన్వీ కపూర్ ఇప్పటికే ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితం. అయినా హీరోయిన్ గా రాణిస్తూ తన కేరీర్ ను చక్కదిద్దుకునే పనిలో ఈ గ్లామర్ బ్యూటీ చేయని ప్రయత్నమంటూ లేదనే చెప్పాలి. జాన్వీ రూపసౌందర్యమే ఆమెకు మొదటి ప్ల‌స్ పాయింట్. మరోవైపు స్టార్ కిడ్ కావడంతో ఇండస్ట్రీలో తన హవా కొనసాగుతోంది.

Janhvi Kapoor trolled by netizen for wearing that dress
Janhvi Kapoor

ఇటీవల.. జాన్వీ, అనన్య ముంబైలోని ఓ రెస్టారెంట్ నుండి బయటికి వస్తూ కనిపించారు. అనన్య తెల్లటి క్రాప్ టాప్ వైట్ జీన్స్‌తో సింపుల్ గా కనిపించగా, జాన్వీ వేసుకున్న డ్రెస్ మాత్రం కెమెరా దృష్టిని ఆకర్షించింది. నీలిరంగు బ్యాక్‌లెస్ సూట్‌ను ధరించి కనిపించింది. డిన్నర్ తర్వాత రెస్టారెంట్ నుండి బయటికి వచ్చినప్పుడు ఆమె బ్యాక్‌లెస్ అందాలు చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోయారు. జాన్వీ డ్రెస్ చూసి ముక్కుమీద వేలేసుకుంటున్నారు నెటిజన్స్. కొంద‌రు అయితే జాన్వీ క‌పూర్ అందాల అరాచ‌కంపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎవ‌రెంత ట్రోల్ చేసినా జాన్వీ క‌పూర్ త‌గ్గేదే లే అంటోంది.

ప్ర‌స్తుతం నార్త్ లో రాణిస్తున్న జాన్వీ క‌పూర్ జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు పూరీ అండ్ టీం. ఇందులో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. జేజీఎం అంటూ విజయ్ ను సైనికుడిగా పరిచయం చేయబోతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళ‌యాళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన దివంగత అగ్రకథానాయక శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇందులో జాన్వీని తీసుకోవడానికి పూరీ శతవిధాలుగా ప్రయత్నారని.. చివరకు కరణ్ జోహార్ స‌హాయంతో జాన్వీని ఒప్పించారని సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment