Janhvi Kapoor : పెళ్లి కూతురు అయిన జాన్వీ క‌పూర్‌..!

April 21, 2022 3:41 PM

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి అందాల కూతురు జాన్వీ క‌పూర్ ఇటీవ‌లి కాలంలో త‌న గ్లామ‌ర్ షోతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తోంది. విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం.. అక్క‌డ వెరైటీ దుస్తుల‌లో ఫొటో షూట్స్ చేస్తూ పిచ్చెక్కించ‌డం వంటివి చేసింది. ఇక సక్సెస్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాయి. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు జాన్వీ కపూర్ చాలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తల్లికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Janhvi Kapoor become bride acted in ad
Janhvi Kapoor

న‌టిగా రాటు దేలేందుకు చాలా కృషి చేస్తున్న జాన్వీ క‌పూర్ త‌న అందం గురించి ఎప్పటికప్పుడు చర్చించుకునేలా సోషల్ మీడియాలో ఆమె ఫోటో షూట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా త‌న గ్లామ‌ర‌స్‌ ఫోటోలను షేర్ చేసే జాన్వీ కపూర్ కాస్త చేంజ్ అన్నట్లుగా ఈ వెడ్డింగ్ లుక్ ఫోటోలు షేర్ చేసింది. జాన్వీ కపూర్ ఖుష్ అనే వెడ్డింగ్ మ్యాగజైన్ కు సంబంధించిన కవర్ పై మెరిసింది. వెడ్డింగ్ కు సంబంధించిన మ్యాగజైన్ అవ్వడంతో అదే లుక్ లో ఈ అమ్మడు సందడి చేసింది. ఈ అమ్మడు మరింతగా అందంగా కనిపించడం కోసం ఇలాంటి ఫొటో షూట్ చేసింద‌ని అంటున్నారు.

జాన్వీ క‌పూర్ ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడామె తమిళనాడులోని చల్లని ప్రదేశాల్లో రిలాక్స్ అవుతోంది. సౌత్‌ టూరిస్ట్ ఏరియాలపై ఫోకస్‌పెట్టింది. ఊటీ, కొడైకెనాల్‌ వంటి సుందరమైన ప్రదేశాల్లో విహరిస్తోంది జాన్వీ కపూర్‌. అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది జాన్వీ. అన్‌లిమిటెడ్‌గా ఆమె ఎంజాయ్‌ చేస్తుందని తాజా పిక్స్ ని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. సమ్మర్‌ వేడి నుంచి, ఉక్కపోత నుంచి రిలీఫ్‌ పొందుతూ, ఊటీ అందాలను తిలకిస్తోంది. అక్కడి చల్లని వెదర్‌ని ఎంజాయ్ చేస్తోంది. జాన్వీ ఏ ఫోటో షేర్ చేసినా అది నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment