Jabardasth Avinash : జబర్ధస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అవినాష్ బిగ్‌బాస్‌లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు . ఆరియానాతో ఎక్కువగా స్నేహం చేసి.. నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు. దాదాపు పైనల్ వరకు వెళ్లిన అవినాష్.. అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు షాకయ్యారు. బయటకు వచ్చాక కూడా అరియానాతో సందడి చేశాడు. ఒకానొక సందర్భంలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే పెళ్లి పెళ్లి అని కలవరించిన ముక్కు అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడు అయ్యాడు. అనూజ అనే అమ్మాయి మెడలో తాళి కట్టి కొత్త జీవితం మొదలుపెట్టాడు అవినాష్. మంగళవారం జరిగిన ఈ వివాహ వేడుకకు యాంకర్ శ్రీముఖితో పాటు.. జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు.
దివి, అరియానా గ్లోరీ, సయ్యద్ సోహైల్‌తో పాటు పలువురు వివాహ వేడుకకు హజరై సందడి చేశారు. రాంప్రసాద్ ‘సారీ బ్రదర్ బ్లండర్ మిస్టేక్ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. అవినాష్ తన పెళ్లి వీడియోను తన సొంత యుట్యూబ్ చానల్ లో విడుదల చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ముందుగానే రాంప్రసాద్ షేర్ చేశాడు.
బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు అవినాష్. గతంలో ఓసారి అవినాష్ పెళ్లి గెటప్‌లో ఉన్న ఫోటోను సైతం నెట్టింట్లో షేర్ చేయడంతో నిజంగానే అవినాష్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…