Jabardasth Apparao : బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్ధస్త్. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. అలాంటి వారిలో అప్పారావు ఒకరు. ఆయన చూడడానికి నల్లగా ఉన్నా కూడా తన అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందారు. తనదైన ప్రత్యేక యాసతో బుల్లితెర లో నవ్వులు పండించేవారు. ఇక అప్పారావు జబర్దస్త్ తోనే అడపాదడపా ఫేమ్ సంపాదించుకున్నారు. అప్పారావు బుల్లితెరపైనే కాకుండా ప్రస్తుతం వెండి తెరపై కూడా హడావిడి చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, సరిలేరు నీకెవ్వరు వంటి పాపులర్ సినిమాల్లో నటించి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడుగా ఓ వెలుగు వెలుగుతున్న అప్పారావు.. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా బుల్లితెర జబర్దస్త్ షో కి కూడా దూరంగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈ షోకు దూరంగా ఉన్న ఆయన కీలక ఆరోపణలు చేశారు. జబర్దస్త్ షో తనకు లైఫ్ ఇచ్చిందన్నారు అప్పారావు. అలాంటి షోనే తనను కొంతకాలం హోల్డ్‌లో పెట్టిందన్నారు. దీంతో ఆ బాధతో తానే షోకు దూరమైపోయానన్నారు. తనపై లేని పోని పుకార్లు సృష్టించారన్నారు. తాను బిగ్ బాస్ కు వెళ్లిపోతున్నానని.. సినిమాల్లోకి వెళ్తున్నానంటూ ఆరోపణలు చేశారన్నారు.
అప్పారావు.. స్పెషల్ మ్యానరిజంతో.. అద్భుతంగా కామెడీ పండిస్తారు. తన టాలెంట్ టో కామెడీ టైమింగ్ తో జబర్థస్త్ లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించారు. అంతకు ముందు అప్పారావు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఈ కామెడీ షో వలన ఆయనకు వచ్చింది. కొన్నాళ్లుగా ఆయన జబర్థస్త్‌లో కనిపించకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. నేను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో స్కిట్లు చేశాను. ఏడెనిమిదేళ్లు నాన్ స్టాప్ గా షూటింగులో పాల్గొంటూ వెళ్లాను. ఎక్కడా కూడా ఎలాంటి రిమార్క్ లేదు. కరోనా కారణంగా నా ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని కొంతకాలం వద్దన్నారు.. అని చెప్పుకొచ్చారు అప్పారావు.
అయితే ఆ తరువాత కూడా వాళ్లు నన్ను పిలవలేదు.. చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్ లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు చేయమన్నా చేశాను. అక్కడ నా మర్యాద తగ్గుతున్నట్టు అనిపించింది. అది అవమానంగా.. బాధగా.. అనిపించిందని.. బాధపడ్డారు అప్పారావు.
ఇన్ని అవమానాలు పడి అక్కడే ఉండటం ఎందుకు అనిపించడంతో జబర్థస్త్ నుంచి తప్పుకున్నానని అప్పారావు తెలిపారు. అంతే కాదు.. ఇక్కడ నుంచి మానేసిన వాళ్ళకు కామెడీ స్టార్స్ లో అవకాశాలు దగ్గడంతో అంతా కామెడీ స్టార్స్ వైపు వెళ్తున్నారు. అప్పారావు మాట్లాడుతూ.. కామెడీ స్టార్స్ లో డబుల్ పేమెంట్ ఇస్తున్నారు.. ఇప్పుడు నా పరిస్థితి బాగుందని.. చెప్పుకొచ్చారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…