Anasuya : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఎంతోమంది ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జెమిని టీవీలో వారంతాలలో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ కార్యక్రమం ఎన్నో అంచనాల నడుమ ప్రసారమవుతోంది. అయితే ఈ షో కి యాంకర్ గా తమన్నాను తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తమన్నా యాంకర్ గా ఉండటం చేత ఈ కార్యక్రమంపై నిర్వాహకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే అనుకున్న విధంగానే మొదటి వారాలలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత ఈ కార్యక్రమం రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ క్రమంలోనే నిర్వాహకులు ఈ కార్యక్రమానికి యాంకర్ ను మార్చాలని భావించారు. బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయను మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకోనున్నట్లు సమాచారం.
అయితే ఈ కార్యక్రమానికి తమన్నా షెడ్యూల్ ప్రకారం రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ప్రస్తుతం తన షెడ్యూలు ముగియడంతో తాను అడిగిన పారితోషకాన్ని నిర్వాహకులు ఇవ్వలేక.. తన స్థానంలో అనసూయని తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే తమన్నా వ్యాఖ్యాతగా ఉండడం చేత ఈ కార్యక్రమం రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయని, ఈ కార్యక్రమ రేటింగ్స్ ను పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమానికి జబర్దస్త్ యాంకర్ అనసూయను తీసుకుంటున్నట్లు సమాచారం.
సాదారణంగా సినీ తారలు సినిమాల్లో బాగా చేస్తారు. కానీ బుల్లితెర విషయానికి వస్తే.. రెగ్యులర్ యాంకర్లలా సినీ తారలు పెర్ఫార్మ్ చేయలేరు. అందువల్లే.. బుల్లితెరపై యాంకరింగ్‌లో పండిపోయిన అనసూయ అయితే ఈ షోకు బాగుంటుందని నిర్వాహకులు అనుకున్నారట. పైగా తమన్నాతో పోల్చితే.. అనసూయ రెమ్యునరేషనే తక్కువగా ఉంటుంది. కనుక ఎటు చూసినా అనసూయే బెటర్ అని ఈ షోకు ఆమెనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనసూయ ఖాతాలో ఇంకో షో పడినట్లే మనం అర్థం చేసుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…