Aishwarya Rai : నటిగా, బచ్చన్ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా తన వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. వయస్సు పెరుగుతున్నా కూడా ఈ నీలి కళ్ల సుందరి వన్నె మాత్రం తగ్గడం లేదు. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్.. అభిషేక్ బచ్చన్‌ని వివాహం చేసుకొని బచ్చన్ కోడలిగా వెళ్లింది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.
గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్ గర్భవతి అంటూ ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ అయితే లేదు. కానీ తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యారాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడ్డారు.
టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. ఆ సమయంలో రిపోర్టర్స్ వారి ఫోటోలను తీయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూతురిని దగ్గరకి లాక్కుంది. చేతిలోని హ్యాండ్‌బ్యాగ్‌ని పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది.
తన బెల్లీని మొదటి నుండి దాచుకోవడానికి ప్రయత్నించిన ఐష్ ప్రస్తుతం గర్భవతి అని చెబుతున్నారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అని అంటున్నారు. కాగా, ఐష్ హీరోయిన్ కన్నా ముందు మిస్ వరల్డ్ అనే విషయం తెలిసిందే.
1994లో ఐష్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్ ‘మిస్ యూనివర్స్’గా నిలిచింది. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఐష్‌కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…