Avinash : బుల్లితెరపై తనదైన హాస్యంతో ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్న కమెడియన్ అవినాష్. బిగ్ బాస్ షో తర్వాత అవినాష్ పాపులరిటీ మరింత పెరిగింది. అక్టోబర్ 20న అవినాష్.. అనూజ అనే యువతిని పెళ్లాడాడు. 24న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. తన సొంత ఊరు జగిత్యాలలో జరిగిన ఈ వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు సందడి చేశారు. చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, శ్రీముఖిల అల్లరితో పెళ్లింట సందడి వాతావరణం నెలకొంది.
అవినాష్‌కి ముందు నుండి మంచి స్నేహితురాలిగా ఉన్న శ్రీముఖి పెళ్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కల్లు పార్టీలో కూడా పాల్గొన్న ఈ భామ నాటు కోడి కూడా ఆరగించినట్టు తన వ్లాగ్‌లో పేర్కొంది.
అవినాష్ పెళ్లి మొదటి నుండి చివరి వరకు ఉన్న శ్రీముఖి అందరి దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. పెళ్లి తర్వాత కూడా శ్రీముఖితో చెట్టాపట్టాలేస్తున్నాడు అవినాష్.
తాజాగా శ్రీముఖి గ్యాంగ్ పబ్‌కి వెళ్లగా, అక్కడ తన సోదరుడు శుశ్రుత్, అవినాష్, అతని భార్య అనూజ ఇలా అందరూ కలిసి రచ్చ చేశారు. తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త కొద్దిరోజులుగా ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుండగా, శ్రీముఖి వాటిపై ఇంకా స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…