Samantha : ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప ఒకటి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తుండగా, అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ మూవీ విడుదలకానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు . ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి” పాటలు విడుదలై అదరగొడుతుండగా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అనే పాటని నవంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.
ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండగా, దాని కోసం వాళ్లు.. వీళ్లు.. అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ సుకుమార్ చివరికి సమంతను ఫిక్స్ చేశాడు. ఆయన తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మ.. మంగమ్మా.. అంటూ ఆడి, పాడి జనాల్ని ఆకట్టుకున్న సమంతనే పుష్పలో ఐటమ్ సాంగ్ చేయబోతోందని తెలుస్తోంది. సుకుమార్‌పై ఉన్న గౌరవంతోనే సమంత ఈ ఐటమ్ సాంగ్ కు ఒప్పుకున్నట్లు సమాచారం.
విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరోవైపు తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది. సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ కోట్స్ కూడా సామ్ షేర్ చేస్తోంది. మై మామ్స్ సెయిడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…