Natu Natu Song : సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక తప్పొప్పులు ఈజీగా తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఏ విషయమైనా కాపీ చేసినట్టు అనిపిస్తే వెంటనే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. రాజమౌళి సినిమాలకు కాపీ ఆరోపణలు వస్తుండడం చాలా సహజం. ఇప్పుడు ఆయన విడుదల చేసిన రీసెంట్ సాంగ్ నాటు నాటు కూడా కాపీ అని అంటున్నారు.
ఈ సాంగ్‌ని పూర్తిగా ఆఫ్రికన్ మూవీ నుంచి మక్కీ టూ మక్కీ కాపీ కొట్టేసిన సాంగ్ అంటున్నారు. దీని మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే సాగుతోంది. అనుకూల, ప్రతికూల కామెంట్స్ తో అటూ ఇటూ అదరగొడుతున్నారు. ఇంతకీ నాటు సాంగ్ మూలమైన ఆఫ్రికన్ సాంగ్ ఎలా ఉంటుంది అంటే.. అక్కడ కూడా ఇద్దరు నటులు ఇదే రకంగా కాస్ట్యూమ్స్ వేసుకుని ఒకే తీరున స్టెప్స్ వీర లెవెల్లో వేస్తారు. ఈ క్రమంలో రాజమౌళి ఆ సాంగ్ చూసి ఇలా తీశాడని అంటున్నారు.
రాజమౌళి గతంలో నాని హీరోగా పెట్టి తీసిన ఈగ మూవీ కూడా కాక్రోచ్ అనే మూవీకి కాపీ అంటూ పాత విషయాలు గుర్తు చేస్తున్నారు. బాహుబలి మూవీ పోస్టర్ కూడా ఒక ఇంగ్లీష్ మూవీ పోస్టర్ కి కాపీ అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే నాటు నాటు పాటకు ఫుల్ క్రేజ్ దక్కగా,ఈ నెగెటివ్ ప్రచారం కూడా సినిమాకి చాలా ఉపయోడపడుతుందని కొందరు అంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…