Sonu Sood : కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పేదలకు అనేకమైన సేవలు చేసిన సోనూసూద్ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆయన అభిమానులందరూ కోరుతుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన చెల్లెలిని రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. నా సోదరి మాళవిక పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది.. అని సోనూసూద్ అన్నారు.
రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం” అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్ ప్రకటించారు.
ఏ పార్టీలో చేరాలన్నది ఐడియాలజీని బట్టి ఉంటుంది. పలు పార్టీల నేతలు ఎంతో మందితో క్యాజువల్ మీటింగ్స్ జరుగుతున్నప్పటికీ, సిద్ధాంతాలే ముఖ్యమన్నది.. మా కుటుంబం నమ్ముతోంది’ అని సోనూ సూద్ వ్యాఖ్యానించారు.
తన పొలిటికల్ ఎంట్రీపైనా నటుడు సోనూ సూద్ క్లారిటీ ఇచ్చారు. తన తరహాలో పనిచేసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చే ఏ వేదికలోనైనా చేరడానికి సిద్ధంగా ఉన్నానని, అది రాజకీయ వేదికైనా కావొచ్చు, లేదా రాజకీయాలతో సంబంధం లేని వేదికైనా కావొచ్చు అని సోనూ సూద్ చెప్పారు.
సోనూ మాటలని బట్టి చూస్తుంటే త్వరలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను, పంజాబ్ సీఎం చన్నిని కలిసిన సోనూ సూద్, త్వరలో అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను కూడా కలవబోతున్నట్లు తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…