IPL 2021 : స‌న్ రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌.. వార్న‌ర్‌కు మ‌ద్ద‌తు..

October 4, 2021 6:43 PM

IPL 2021 : క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2021 రెండో ద‌శ ప్ర‌స్తుతం యూఏఈలో జ‌రుగుతోంది. అయితే ఈ ఎడిష‌న్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చాలా చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను చూపింది. బ్యాట్స్‌మెన్‌, బౌల‌ర్లు, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ విఫ‌ల‌మైంది. కొంద‌రు ముఖ్య ఆట‌గాళ్లు త‌ప్ప ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. దీంతో హైద‌రాబాద్ జ‌ట్టు ఈసారి ప్లే ఆఫ్స్‌కు దూర‌మైంది.

IPL 2021 : స‌న్ రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌.. వార్న‌ర్‌కు మ‌ద్ద‌తు..

ఈ ఏడాది ఐపీఎల్ ఎడిష‌న్‌లో హైద‌రాబాద్ ఆడిన 12 మ్యాచ్‌ల‌లో కేవ‌లం 2 మ్యాచ్ ల‌లోనే గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. అయితే టీమ్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా కెప్టెన్‌గా డేవిడ్ వార్న‌ర్‌ను త‌ప్పించారు. త‌రువాత డేవిడ్ వార్న‌ర్ బ్యాట్స్‌మ‌న్ గా కూడా విఫ‌లం అయ్యాడు. దీంతో అత‌న్ని టీమ్‌లోంచే త‌ప్పించారు. ఓ ద‌శ‌లో అత‌ను తీవ్ర నిరాశ‌లో ఉన్న‌ట్లు కూడా క‌నిపించాడు.

https://twitter.com/Samarpratap1207/status/1444720010102919175

అయితే తాజాగా జ‌రిగిన హైద‌రాబాద్ మ్యాచ్‌లో టీమ్‌లో లేక‌పోవ‌డంతో వార్న‌ర్ స్టాండ్స్‌లో ఉండి టీమ్‌కు మ‌ద్ద‌తు ప‌లికాడు. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. హైద‌రాబాద్ ఫ్యాన్స్ వార్న‌ర్‌ను ఇంకా ఇష్ట‌ప‌డుతూనే ఉండ‌డం విశేషం.

ఐపీఎల్ లేక‌పోయినా నిజానికి వార్న‌ర్ ఎప్పుడూ ఇక్క‌డి అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గానే ఉన్నాడు. అప్పుడ‌ప్పుడు ప‌లు తెలుగు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ సంద‌డి చేస్తుంటాడు. అయితే ఒక‌టి రెండు మ్యాచ్ ల‌లో ఫెయిల్ అయ్యాడ‌ని చెప్పి వార్న‌ర్‌ను పూర్తిగా టీమ్‌లోంచే తీసేయ‌డం మంచిది కాద‌ని, ఫ్యాన్స్ హైద‌రాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ పై మండిప‌డుతున్నారు.

డేవిడ్ వార్న‌ర్‌కు త‌మ మ‌ద్ద‌తు ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని కొంద‌రు అత‌నికి స‌పోర్ట్‌గా పోస్ట్‌ల‌ను పెడుతుండ‌గా.. ఇంకొంద‌రు మాత్రం.. వ‌చ్చే ఐపీఎల్‌లో హైద‌రాబాద్ కు ఆడ‌వ‌ద్ద‌ని, వేరే ఏదైనా టీమ్‌లోకి వెళ్ల‌మ‌ని సూచిస్తున్నారు. మా స‌పోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి వార్న‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now