ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రతి ఏడాది యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్లను సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్‌లోనే లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈసారి నాలుగు మోడల్స్‌ను యాపిల్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఐఫోన్ 14, 14 ప్రొ, 14 మ్యాక్స్, 14 మ్యాక్స్ ప్రొ పేరిట నాలుగు మోడల్స్ రిలీజ్ కానున్నాయని సమాచారం.
ప్రొ మోడల్స్‌లో యాపిల్ కొత్త చిప్ సెట్ ఎ16 బయానిక్‌ను ఏర్పాటు చేసి అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాన్ ప్రొ మోడల్స్‌లో పాతదైన ఎ15 బయానిక్ చిప్‌ను ఏర్పాటు చేశారని సమాచారం. ఈ ఫోన్లను సెప్టెంబర్ 6 నుంచి 13 తేదీల మధ్యలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్లలో శాంసంగ్ తరహా ఓలెడ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.
ఇక ఐఫోన్ 14, 14 ప్రొ మోడల్స్‌లో 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, 14 మ్యాక్స్, 14 మ్యాక్స్ ప్రొలలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీలను ఏర్పాటు చేశారని సమాచారం. కాగా ఐఫోన్ 14 మోడల్స్ ప్రారంభ ధర రూ.62వేల నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. వీటిని సెప్టెంబర్ చివరి వారం నుంచి విక్రయిస్తారని సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…