వరుస చిత్రాలు ఫ్లాప్ అవుతుండడంతో ఈసారి తీసే సినిమా అలా కాకూడదని చెప్పి.. నందమూరి కల్యాణ్ రామ్ తీసిన మూవీ.. బింబిసార. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌తోనే చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఈ మూవీ ఒక మైలు రాయిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక తన సొంత బ్యానర్ ఎన్‌టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ స్వయంగా రూ.37 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్‌ను కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చేపడుతున్నారు.
బింబిసార మూవీలో క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్స్‌లో నటిస్తుండగా.. మరో పాత్రలో వరీనా హుస్సేన్ నటిస్తోంది. అలాగే వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే కీస్త్రు శకం 5వ శతాబ్దం నాటి మగధ రాజు బింబిసారుడి కథాంశంతో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఎంతగానో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ మూవీ ఆగస్టు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ఈ మూవీకి గాను ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు. ప్రముఖ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు.. బింబిసార మూవీని చూసి ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీ చాలా బాగుందని.. కళ్యాణ్‌రామ్ కు మంచి హిట్ మూవీ అవుతుందని.. టాలీవుడ్‌కు మంచి పేరు వస్తుందని చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది.
ఇక ఈ మూవీలో చాలా భాగం వరకు గ్రాఫిక్స్‌తోనే సీన్లను తీశారట. అలాగే ఆదిత్య 369 మూవీలా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. దీంతో సినిమా హిట్ పక్కా అని తెలుస్తోంది. అయితే ఈ చిత్ర ఫలితం ఏమిటో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ క్రమంలోనే సినిమా కోసం అటు నందమూరి ఫ్యాన్స్‌తోపాటు ఇటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…