ప్ర‌పంచం అత్యంత ప్రమాద‌క‌ర స్థితిలో ఉంది: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

July 3, 2021 4:57 PM

కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భార‌త్‌లో మొద‌ట‌గా గుర్తించ‌బ‌డిన డెల్టా వేరియెంట్ ప్ర‌పంచంలో ఇప్పుడు అనేక దేశాల్లో వ్యాప్తి చెందుతుంద‌ని, అది అనేక సార్లు మ్యుటేష‌న్‌కు గుర‌వుతుంద‌ని ఆ సంస్థ తెలిపింది. ఈ మేర‌కు WHO డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

world is in very dangerous situation who

ప్ర‌పంచంలో చాలా దేశాల్లో కోవిడ్ మ‌ళ్లీ వ్యాప్తి చెందుతుంద‌ని, అందువ‌ల్ల టీకాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయాలన్నారు. డెల్టా వేరియెంట్ అనేక దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతూ ప్ర‌మాద‌క‌రంగా మారింద‌న్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా 98 దేశాల్లో డెల్టా వేరియెంట్‌ను గుర్తించార‌ని అన్నారు. ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌న్నారు. అందువ‌ల్ల టీకాల పంపిణీని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలన్నారు. అలాగే కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌న్నారు. క‌రోనా కేసులు వేగంగా పెరిగే చోట్ల టెస్టుల‌ను ఎక్కువ‌గా చేయాల‌న్నారు. కోవిడ్ మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment