వామ్మో.. ముగ్గురు సంతానమా ..మాకొద్దంటున్న చైనీయులు.. ఎందుకో తెలుసా?

June 3, 2021 10:15 PM

ప్రస్తుతం మన దేశంలో పిల్లల్ని కనడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎంతమంది పిల్లలు అయినా కనే హక్కు భారతదేశంలో ఉంది. కానీ చైనాలో మాత్రం అక్కడి ప్రభుత్వం ఆదేశాల మేరకే పిల్లల్ని కనాలి. ఒకప్పుడు ఒకరు మాత్రమే చాలాని చెప్పే చైనా తరువాత ఇద్దరు పిల్లల్ని కనండి అని ఆదేశాలిచ్చింది. తాజాగా చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల్ని కనండి అని ఆదేశాలు జారీ చేయడంతో చైనీయులు మాకొద్దు బాబోయ్.. అంటూ లబోదిబోమంటున్నారు.

ప్రస్తుతం చైనా దేశ జనాభా అధికంగా ఉన్నప్పటికీ చైనాలో మాత్రం యువత క్రమంగా తగ్గిపోతుందని అందుకోసమే ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనాలని ఆదేశాలు జారీ చేసింది. కొందరు యువత పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ వారికి సంతానం వద్దు అనుకుంటున్నారు. అదేవిధంగా మరికొందరికి సంతానం కలగకపోవడం వల్ల రాబోయే కాలానికి యువత సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది.

అయితే చైనాలో ఉన్నటువంటి అధికమైన ఖర్చును భరిస్తూ పిల్లల్ని కనిపించాలంటే ఎంతో భారంతో కూడుకున్న పని. అందుకోసమే అక్కడ చాలా మంది యువత తమకు సంతానం వద్దని భావిస్తున్నారు. ఇండియాలో లాగే అక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్నో సదుపాయాలు కల్పిస్తూ ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు డెలివరీల కోసం ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. ఈ క్రమంలోనే ఒకసారి డెలివరీ కావాలంటే లక్ష యువాన్లు అవుతోంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.11,49,043 అన్నమాట. ఇందుకోసమే అక్కడ యువత వారికి పిల్లలు వద్దని భావిస్తున్నారు.

ప్రస్తుతం చైనా వ్యాప్తంగా ఒక మహిళకు 1.3 పిల్లలు మాత్రమే ఉంటున్నారు. అంటే కోటి మంది తల్లులు ఉంటే… వారికి కోటి 30 లక్షల మంది పిల్లలు మాత్రమేఉన్నారు ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి ఇద్దరు పిల్లలు కూడా లేకపోవడంతో చైనా ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment