రాత్రికి రాత్రే ఇత‌ను 20 ఏళ్ల జీవితాన్ని మ‌రిచాడు.. ఏవీ గుర్తుకు లేవు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

July 28, 2021 5:22 PM

మీకు సూర్య న‌టించిన గజిని సినిమా గుర్తుంది క‌దా. అందులో అత‌నికి మెమొరీ లాస్ ఉంటుంది. అప్ప‌టిక‌ప్పుడే చూసిన‌వి, విన్న‌వి.. అన్నీ మ‌రిచిపోతుంటాడు. దీంతో అత‌ను ఫొటోలు తీసి వాటి కింద గుర్తులు పెట్టుకుని జీవిస్తుంటాడు. నిజానికి ఇలా నిజ జీవితంలో జ‌ర‌గ‌డం అనేది అత్యంత అరుదుగా జ‌రుగుతుంటుంది. దాదాపుగా ఈ విధంగా ఎవ‌రికీ జ‌ర‌గ‌దు. కానీ ఒక వ్య‌క్తి మాత్రం ఏకంగా త‌న 20 ఏళ్ల జ్ఞాప‌కాల‌ను, జీవితాన్ని మ‌రిచిపోయాడు. ఈ సంఘ‌ట‌న అమెరికాలో చోటు చేసుకుంది.

this man forget about his 20 years of life in single night

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 36 ఏళ్ల డానియెల్ పోర్ట‌ర్ కు రూత్ అనే భార్య, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే డానియెల్ ఒక రోజు తెల్ల‌వారుజామున నిద్ర‌లేవ‌గానే త‌న గ‌తం మ‌రిచిపోయాడు. ఏకంగా 20 ఏళ్లు వెన‌క్కి వెళ్లాడు. త‌న‌ను తాను అద్దంలో చూసుకుని అంత‌లా మారిపోయానేంటి, వ‌య‌స్సు మీద ప‌డిందేమిటి, త‌న‌కు 16 ఏళ్లే క‌దా.. అని అన్నాడు. అయితే ఇంట్లో ఉన్న త‌న భార్య‌ను చూసి గుర్తు ప‌ట్ట‌లేదు. బాగా మ‌ద్యం సేవించి ఎవ‌రో మహిళ‌తో క‌ల‌సి నిద్రించాన‌ని, అందువ‌ల్ల వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోవాల‌ని అనుకున్నాడు.

కానీ డానియెల్ భార్య రూత్ అత‌ని ప‌రిస్థితిని అర్థం చేసుకుని వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లింది. అక్క‌డ వారు ప‌రీక్షించి చూశారు. అత‌నికి Transient Global Amnesia ఉంద‌ని చెప్పారు. ఇది అత్యంత అరుదైన వ్యాధి అని, ఇందులో భాగంగా వ్య‌క్తులు గ‌తాన్ని మ‌రిచిపోతార‌ని వైద్యులు చెప్పారు. అత‌నికి 20 ఏళ్ల కిందటి విష‌యాలు మాత్ర‌మే గుర్తున్నాయి. త‌న‌కు పెళ్ల‌యింది, కుమార్తె జ‌న్మించింది.. ఇత‌ర విష‌యాలు ఏవీ గుర్తులేవు. త‌న భార్య‌, కుమార్తె, ఇల్లు, ఇత‌రుల‌ను కూడా గుర్తు పట్ట‌లేక‌పోతున్నాడు.

అయితే అత‌నికి ప్ర‌స్తుతం వైద్యులు చికిత్స‌ను అందిస్తున్నారు. దీంతో కొద్ది కొద్దిగా మార్పు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ గ‌తం గుర్తుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. నిజంగా ఇత‌ని క‌థ సినిమాలాగే ఉంది క‌దా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment