భారీగా పతనమవుతున్న ముడిచమురు ధరలు.. కారణం?

April 21, 2021 10:12 PM

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై అధికంగా పడుతుంది. గత ఏడాది కరోనా కేసులు అధికమవడంతో లాక్ డౌన్ విధించడం వల్ల ఈ ప్రభావం దేశీ ఆర్థిక వ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న సమయంలో దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల పై పడింది.

ప్రపంచంలో ముడి చమురు దిగుమతులలో భారత్ మూడవ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న కారణంగా ముడి చమురు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ క్రమంలోనే మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర 48 సెంట్లు ప‌డిపోగా.. బుధ‌వారం మ‌రో 48 సెంట్లు పతనమయ్యింది.

ఎక్కువ చమురు వినియోగించే దేశాలలో ఇండియా ఒకటి. ఇక్కడ రోజు రోజుకి కేసులు పెరగడంతో ఆయిల్ వినియోగం తగ్గిందని కోట‌క్ సెక్యూరిటీస్ కమాడిటీస్ వైస్ ప్రెసిడెంట్ ర‌వీంద్ర రావ్ అన్నారు.ప్ర‌స్తుతం బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 66.09 డాల‌ర్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment