మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. వ‌డ్డీ లేని రుణాలు.. ఏ వ్యాపారం అయినా చేయొచ్చు..

August 19, 2022 2:28 PM

ఎంతోమంది మహిళలు తాము ఆర్థికపరంగా ఏదో సాధించాలని ఉన్నా కూడా సహకారం లేక వెనకకు తగ్గుతూ ఉంటారు. నిరుద్యోగ మహిళలకు, గృహిణులకు ఇది మంచి అవకాశం. ఇంటి వద్దే ఉండి వ్యాపారం చేయాలనుకుంటున్నారా..  మీకు ఏదైనా సాధించాలని పట్టుదలగా ఉందా. ఈ గుడ్ న్యూస్ ను మహిళల కోసమే కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగిని పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది. మీరు ఎలాంటి వ్యాపారం చేయాలో అనేది అవగాహన లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. బేకరీ క్యాంటీన్, క్లీనింగ్ పౌడర్, అగరబత్తులు తయారు చేయడం, బ్యూటీ పార్లర్ ఇలా ఎన్నో రకాల బిజినెస్ ల‌కు సంబంధించి కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వంతో కొన్ని సంస్థలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.

indian government offering interest free loans to women

ప్రతి మహిళ తాను చేయాలనుకున్న వ్యాపారంపై కోచింగ్ తీసుకొని బ్యాంకు రుణాలను ఈజీగా పొందవచ్చు. మ‌హిళ‌లు వ్యాపారం స్టార్ట్ చేసి ఆదాయాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే ఈ ఉద్యోగిని పథకం గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఉద్యోగిని పథకం పొందడానికి కనీసం 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. కుటుంబ సంవత్సర ఆదాయం కనీసం రూ.50వేల లోపు ఉండాలి. అంతకు పైన ఆదాయం కలిగి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు.

వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు అయి ఉంటే మీకు ఆదాయంతో సంబంధం లేదు. మంచిగా చదువుకొని వ్యాపారపరంగా పైకి రావాలి అనుకునే మహిళల‌కు కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వడ్డీ లేని లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే మరిన్ని వివరాల కోసం  https://udyogini.org/ అనే లింక్ ని క్లిక్ చేయాలి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే మహిళల‌కు స్థానికంగా ఉన్న కో ఆపరేటివ్‌ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్ ల‌లో లోన్ సదుపాయాన్ని క‌ల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment