ద్విచక్ర వాహనదారులు అలర్ట్.. ఇకపై ఇవి లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిందే!

April 14, 2021 10:11 PM

దేశంలో కొన్ని కోట్లలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. గత కొంత కాలం నుంచి ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువగా ఉంది. అయితే ఇకపై ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వారు తప్పనిసరిగా సేఫ్టీ రూల్స్ పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.ద్విచక్ర వాహనం నడిపే వారు సేఫ్టీ రూల్స్ ను పాటించని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ద్విచక్ర వాహనాలను నడిపే వారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.ఇకపై ద్విచక్ర వాహనం నడిపే వారు బండికి కచ్చితంగా రియల్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్స్ తప్పనిసరి. ఇండికేటర్లు లేకపోయినా, రియల్ వ్యూ మిర్రర్స్ లేకపోయినా ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఒక సర్వే ప్రకారం ప్రమాదాలలో ఎక్కువగా రియల్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడయింది.సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 5, 7 ప్రకారం టూవీలర్లకు రియల్ వ్యూ మిర్రర్లు కచ్చితంగా ఉండాలి. వీటితోపాటు బండికి సంబంధించిన సర్టిఫికెట్లను వాహనదారులు తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలి. వీటిలో ఏ ఒక్కటి లేనిపక్షంలో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment