ఆక్సిజన్ ఫ్రీగా సరఫరా చేస్తున్న యువకుడు అరెస్ట్.. ఎందుకంటే?

May 5, 2021 11:15 PM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నప్పటికీ చాలా చోట్ల ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కొందరు మానవతా వాదులు తమ సొంత ఖర్చులతో ఆక్సిజన్ సిలిండర్లు కొని కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా సహాయం చేస్తున్న ఓ యువకుడిని అందరూ మెచ్చుకోవాల్సిందే పోయి ఏకంగా జైల్లో పెట్టారు.

వివరాల్లోకి వెళ్తే… యూపీలోని జౌన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా ఎంతో మంది అవస్థలు పడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న విక్కీ అగ్రహారి అనే యువకుడు స్పందించి.. సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు చేసి బాధితులకు ఆక్సిజన్ అందిస్తున్నాడు. ఈ విషయంపై ఎంతోమంది విక్కీపై ప్రశంసలు కురిపించగా పోలీసులు మాత్రం అతన్ని జైల్లో పెట్టారు.

ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విక్కీ కరోనా పరీక్షలు చేయించుకోకుండా,శానిటైజ్ చేయకుండా ఆక్సిజన్ సిలిండర్లను బాధితులకు అందిస్తూ covid-19 నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదు చేయడంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి ఐపీసీ 188, 269 సెక్షన్లు, ఎపిడెమిక్ డిసీజెస్ చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment