వ్యాక్సిన్ వేయించుకునేవారికి “ఉబెర్” బంపరాఫర్.. ఏంటంటే?

May 5, 2021 11:13 PM

ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో ప్రముఖ క్యాబ్ సంస్థ “ఉబెర్” కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వినియోగదారులకు ఈ సమస్త బంపర్ ఆఫర్ ప్రకటించింది.కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి టీకా కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్‌ సౌకర్యాన్ని అందిస్తోంది. రైడర్స్ టీకా కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ .300 విలువైన రైడ్‌లు పొందవచ్చని “ఉబెర్”తెలిపింది.

ఉచిత రైడ్ ఉబెర్ గో, ఉబెర్‌ గో సెడాన్, ఉబెర్ ప్రీమియర్లలో మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఉబెర్‌ ప్రకటించింది. ఈ ఫ్రీ రైడ్‌ను ఉపయోగించుకోవడం కోసం వినియోగదారులకు ఈ యాప్ ఒక ప్రోమో కోడ్ ఇస్తుంది. దీనిద్వారా 36 నగరాల్లోని అన్ని టీకా కేంద్రాలను ఉబెర్ యాప్‌లో పేర్కొంది.

ఈ యాప్ ఓపెన్ చేసి వాలెట్ సెలెక్ట్‌ చేసి ఉచిత ప్రయాణానికి యూజర్లు ప్రోమో కోడ్ (10ఎం21వి) ని ఎంచుకోవాలి. ఆ తరువాత సమీప టీకా కేంద్రానికి పిక్-అప్ లేదా టీకా కేంద్రం వివరాలను ఇక్కడ నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఉబెర్ఈ సదుపాయాన్ని కల్పించడం మాత్రమే కాకుండా మనకు దగ్గరలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ కేంద్రాల జాబితాను కూడా పొందుపరిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment