డ్రెయినేజీ కోసం త‌వ్వుతుంటే సొరంగం బ‌య‌ట పడింది.. గుప్త నిధులు ఉన్నాయేమోన‌ని ఎగ‌బ‌డ్డ జ‌నం..

August 13, 2021 12:50 PM

పురావ‌స్తు శాఖ త‌వ్వ‌కాల్లో అప్పుడ‌ప్పుడు విలువైన సంప‌ద బ‌య‌ట ప‌డుతుంటుంది. పూర్వ కాలానికి చెందిన రాజులు లేదా ప్ర‌ముఖ వ్య‌క్తులు దాచి పెట్టిన సంప‌ద‌తోపాటు విలువైన వ‌స్తువులు ఆ త‌వ్వకాల్లో బ‌య‌ట ప‌డుతుంటాయి. అయితే కొన్ని చోట్ల యాదృచ్ఛికంగానే ఇత‌ర ప‌నుల‌కు త‌వ్వ‌కాలు చేప‌డితే సంప‌ద బ‌య‌ట ప‌డుతుంది. కానీ ఇలా దాదాపుగా అరుదుగానే జ‌రుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

డ్రెయినేజీ కోసం త‌వ్వుతుంటే సొరంగం బ‌య‌ట పడింది.. గుప్త నిధులు ఉన్నాయేమోన‌ని ఎగ‌బ‌డ్డ జ‌నం..

అయితే అక్క‌డ కూడా ఈ విధంగానే వేరే ప‌నికోసం త‌వ్వకాల‌ను చేప‌ట్టారు. దీంతో ఓ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. ఆ విష‌యం తెలిసిన స్థానికులు అంతులేని సంప‌ద ఉందేమోన‌ని భావించి అక్క‌డ భారీ ఎత్తున పోగ‌య్యారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ప‌శ్చిమ బెంగాల్‌లోని బీర్‌భ‌మ్ జిల్లాలో ఉన్న రాజ్‌న‌గ‌ర్ అనే ప్రాంతంలో మున్సిప‌ల్ సిబ్బంది డ్రైనేజీ నిర్మాణం కోసం త‌వ్వ‌కాలు చేప‌ట్టారు. అయితే అనూహ్యంగా ఓ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆ సొరంగం గుండా వెళితే స‌మీపంలో ఉన్న ప్యాలెస్‌కు చేరుకోవ‌చ్చ‌ని, అందులో అంతులేని సంప‌ద ఉందేమోన‌ని భావించిన స్థానికులు ఆ మార్గంలో త‌వ్వ‌డం చేప‌ట్టారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకునే స‌రికి అక్క‌డ ఉన్న జ‌నాలు పారిపోయారు. ఇక అక్క‌డ ప‌నులు ఏవీ చేప‌ట్ట‌కుండా ప్ర‌స్తుతం నిలిపివేశారు. కానీ ఆ సొరంగంలో ఏదో ఉంద‌ని స్థానికులు అనుకుంటున్నారు.

అయితే అది సొరంగం కాద‌ని, గ‌తంలో ఎవ‌రో భ‌వ‌న నిర్మాణం కోసం త‌వ్విన మార్గ‌మ‌ని కొంద‌రంటున్నారు. ఇక ఈ విష‌య‌మై వివ‌రాలు తెలియాల్సి ఉంది. అక్క‌డికి స‌మీపంలోని రాజ్‌బ‌రి అనే ప్రాంతంలో ప్యాలెస్ ఉంది. అయితే ఈ సొరంగం అక్క‌డికి అనుసంధానం అవుతుంద‌ని, దాని గుండా వెళితే సంప‌ద ల‌భిస్తుంద‌ని.. ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. దీంతో పోలీసులు అక్క‌డ గ‌స్తీ పెంచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment