నేను ఏమిట‌నేది ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు.. ప్ర‌జ‌లంతా నా వెంట ఉన్నారు.. ఐటీ దాడుల‌పై సోనూసూద్ భావోద్వేగ పోస్టు..

September 20, 2021 9:05 PM

ప్ర‌ముఖ న‌టుడు, సంఘ సంస్క‌ర్త సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల్లో గ‌త 4 రోజుల నుంచి ఇన్‌క‌మ్‌ట్యాక్స్ విభాగం సోదాల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రూ.20 కోట్ల మేర ప‌న్ను ఎగ్గొట్టార‌ని ఐటీ విభాగం తెలిపింది. బోగ‌స్ లోన్లు తీసుకోవ‌డంతోపాటు విదేశాల నుంచి నిధుల‌ను రాబ‌ట్ట‌డంలో నిబంధ‌న‌ల‌ను ఆయ‌న ఉల్లంఘించార‌ని ఐటీ శాఖ అధికారులు ఆరోపించారు. అయితే ఈ విష‌యంపై సోనూసూద్ స్పందించారు.

నేను ఏమిట‌నేది ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు.. ప్ర‌జ‌లంతా నా వెంట ఉన్నారు.. ఐటీ దాడుల‌పై సోనూసూద్ భావోద్వేగ పోస్టు..

గ‌త కొద్ది రోజులుగా త‌న ఇళ్లు, ఆఫీసుల‌కు అతిథులు వ‌స్తున్నార‌ని, అందువ‌ల్ల ప్ర‌జా సేవ చేయ‌లేక‌పోతున్నాన‌ని సోనూ సూద్ తెలిపారు. మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటాన‌న్నారు. త‌న ఫౌండేష‌న్‌లో ప్ర‌తి ఒక్క‌రు ఇందుకోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నార‌న్నారు. త‌న‌కు ఎండార్స్‌మెంట్ల ద్వారా ల‌భించే ఆదాయం మొత్తాన్ని పేద‌ల కోసం స‌హాయం చేసేందుకు విరాళం ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీల‌ను కోరిన‌ట్లు తెలిపారు.

త‌న గురించి ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని, తాను ఏమిట‌నేది అంద‌రికీ తెలుస‌ని, దాని గురించి క‌థ‌లు చెప్పాల్సిన ప‌నిలేద‌ని సోనూ సూద్ తెలిపారు. దేశ ప్ర‌జ‌లంద‌రూ త‌న వెంట ఉన్నార‌ని సోనూసూద్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో భావోద్వేగ పోస్టు పెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment