Sonu Sood : రాజ‌కీయాల్లోకి రావ‌డంపై ఎట్ట‌కేల‌కు స్పందించిన సోనూసూద్‌.. ఏమ‌న్నారంటే..?

January 25, 2022 4:34 PM

Sonu Sood : భార‌తదేశంలో ఎవ‌రికీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.. సోనూసూద్‌.. క‌రోనా క‌ష్ట‌కాలం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సోనూసూద్ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తూనే ఉన్నాడు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది పేద‌ల‌ను, వ‌ల‌స కూలీల‌ను వారి వారి సొంత గ్రామాల‌కు చేర్చాడు. ఇక క‌రోనా రెండో వేవ్ స‌మ‌యంలో దేశవ్యాప్తంగా అనేక మందికి వైద్య స‌దుపాయాల‌ను.. ముఖ్యంగా ఆక్సిజ‌న్‌ను అందజేశాడు.

Sonu Sood  given clarity on his entry into politics

త‌న వ‌ద్ద‌కు ఎవ‌రైనా స‌హాయం చేయ‌మ‌ని వ‌స్తే.. కాదు, లేదు అన‌కుండా సోనూసూద్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆదుకుంటున్నాడు. ఇక ఆయ‌న సోద‌రి ఇటీవ‌లే రాజ‌కీయాల్లో ప్ర‌వేశం చేశారు. సోనూసూద్ సోద‌రి మాళ‌విక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు. అయితే సోనూసూద్‌ను రాజ‌కీయాల్లోకి రావాల్సిందిగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది ఆహ్వానించారు. కానీ రాజ‌కీయాల‌పై సోనూ ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే తాజాగా ఈ విష‌యంపై ఆయ‌న స్పందించారు.

మరో ఐదు సంవత్సరాల పాటు సమాజ సేవ చేసి ఆ త‌రువాత రాజకీయాలలోకి వస్తానని సోనూసూద్‌ తెలిపారు. అయితే ఎప్పుడైతే ఈ పదవికి తాను అర్హుడిన‌ని అందరూ అంటారో అలాంటి సమయంలో తాను రాజకీయాలలోకి వస్తానని తెలిపారు.

ఇక తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలోనే చేరుతానని ఈ సందర్భంగా సోనుసూద్ తెలియజేశారు. కాగా ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోనూసూద్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన సోదరి మాళవికకు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలపై స్పందించిన సోనూసూద్ పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now