ఆలస్యం చేస్తే ప్రాణాంతకమే.. ఆలస్యం చేయొద్దంటున్న నిపుణులు!

May 2, 2021 8:35 PM

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఉన్నఫలంగా కుప్పకూలి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులలో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు అందక మరణం పొందుతున్నారు. అయితే చాలామంది వారిలో కరోనా లక్షణాలు కనిపించిన వారు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్లనే ఈ ఈ విధంగా మరణాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా లక్షణాలు బయటపడటంతో ఇంట్లోనే ఉంటూ ఏవో మందులు వాడుతూ పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రి చుట్టూ పడకలు, ఆక్సిజన్ కోసం తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మరణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొదటి దశ తో పోలిస్తే రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, కేవలం 3-4 రోజుల వ్యవధిలోనే వ్యాధి తీవ్రత అధికమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మొదటి దశతో పోలిస్తే రెండవ దశలో కరోనా వైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విధంగా మరణాల సంఖ్య పెరగడానికి గల కారణం వ్యాధి తీవ్రత అధికమైన తర్వాత చాలామంది ఆసుపత్రులకు రావడంతో వారికి సరైన సమయంలో సరైన చికిత్స అందకపోవడం వల్లనే మరణిస్తున్నారని తెలిపారు.కనుక ఈ మహమ్మారి పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సరైన చికిత్స తీసుకుని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య అధికారులు తెలియ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment