కరోనాతో తండ్రి మరణం.. చితిమంటల్లోకి దూకిన కూతురు!

May 6, 2021 10:42 PM

కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారిన పడే చనిపోతుండగా మరి కొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఈ విధంగా కరోనా సోకి మృతి చెందిన వారికి దహన సంస్కరణలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు ముందుకు రావడం లేదు. మరికొందరు తమ కుటుంబ సభ్యులను కడసారి చూడలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌‌లోని కరోనాతో చనిపోయిన తండ్రి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా తన తండ్రి మరణం తట్టుకోలేక ఆ కూతురు చితి మంటల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

రాజస్థాన్‌‌లోని రాయ్‌ కాలనీకి చెందిన దామోదర్ దాస్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో దామోదర్ దాస్ మరణించాడు. ఈ క్రమంలోనే అతని మృతదేహానికి పంచాయతీ సిబ్బంది, తమ కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే దామోదర్ దాస్ చితికి నిప్పటించిన వెంటనే అతడి కుమార్తె శారద చితిపైకి దూకేసింది. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ ఎంతో షాక్ కి గురయ్యారు. ఒక్క నిమిషం ఈ షాక్ నుంచి తేరుకొని హుటాహుటిన శారదను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment