రైతు ఖాతాలో రూ.52 కోట్లు.. కొంచెం మొత్తం అలాగే ఉంచండి.. అంటూ వేడుకోలు..

September 18, 2021 10:58 AM

బీహార్‌లో ఏం జ‌రుగుతుందో తెలియ‌డం లేదు కానీ ఇటీవ‌లి కాలంలో కొంద‌రి ఖాతాల్లో కోట్ల రూపాయ‌ల్లో డ‌బ్బు జ‌మ అవుతోంది. బ్యాంకులో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య లేదా ఇతర కార‌ణాలు ఏమున్నాయో తెలియ‌దు. కానీ కొంద‌రి ఖాతాల్లో ఈ మ‌ధ్య కాలంలో కోట్ల రూపాయ‌లు జ‌మ అయ్యాయి. అలాగే తాజాగా ఓ రైతు ఖాతాలో ఏకంగా రూ.52 కోట్లు జ‌మ అయ్యాయి. దీంతో అత‌ను, అధికారులు షాక్ తిన్నారు.

రైతు ఖాతాలో రూ.52 కోట్లు.. కొంచెం మొత్తం అలాగే ఉంచండి.. అంటూ వేడుకోలు..

బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ జిల్లా క‌తిహార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన రామ్ బ‌హ‌దూర్ షా అనే రైతుకు నెల నెలా పెన్ష‌న్ వ‌స్తోంది. అందులో భాగంగానే పెన్ష‌న్ వ‌చ్చిందా, రాలేదా ? అన్న విష‌యాన్ని తెలుసుకునేందుకు అత‌ను స‌మీపంలో ఉన్న క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ పాయింట్ (సీఎస్‌పీ) వ‌ద్ద‌కు వెళ్లాడు.

సీఎస్‌పీ వ‌ద్ద ఉద్యోగులు అత‌ని ఖాతాను చెక్ చేశారు. అందుకుగాను ఆధార్ బ‌యోమెట్రిక్ తీసుకున్నారు. అయితే రామ్ బ‌హ‌దూర్ షా ఖాతాలో ఏకంగా రూ.52 కోట్లు ఉండ‌డాన్ని చూసి అంద‌రూ ఖంగు తిన్నారు. అంత మొత్తం ఆ రైతు ఖాతాలోకి ఎలా వ‌చ్చిందో తెలియ‌డం లేదు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అయితే ఆ రైతు మాత్రం త‌న జీవితం దుర్భ‌రంగా మారింద‌ని, క‌నుక ఆ మొత్తంలో కొంత డ‌బ్బును త‌న ఖాతాలో అలాగే ఉంచాల‌ని.. దీంతో త‌న జీవితం బాగు ప‌డుతుంద‌ని అధికారుల‌ను వేడుకుంటున్నాడు. అయినా వారు అత‌ని మాట విన‌రు క‌దా. అయితే ఈ విధంగా చాలా మంది ఖాతాల్లో కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఎందుకు జ‌మ అవుతుందో అర్థం కావ‌డం లేదు. దీనిపై త్వ‌ర‌లోనే వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment