ఓట్ల‌కు డ‌బ్బులు ఇచ్చే వారి వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టండి.. క‌మ‌ల‌హాస‌న్ పిలుపు..

April 4, 2021 12:08 PM

ఓట్ల కోసం డ‌బ్బులు లేదా బ‌హుమ‌తులు ఇచ్చే వారి వివ‌రాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌లు బ‌య‌ట పెట్టాల‌ని మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ చీఫ్ క‌మ‌ల హాస‌న్ పిలుపునిచ్చారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ద‌క్షిణ కోయంబ‌త్తూర్‌లో నిర్వ‌హించిన ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్య‌లు చేశారు.

post the details on social media of those who give money to voters says kamal hassan

ప్ర‌జ‌ల ఓట్ల‌ను డ‌బ్బులు లేదా బ‌హుమ‌తులతో కొనాల‌ని ఎవ‌రైనా ఆశ చూపితే అలాంటి వారి వివ‌రాల‌ను ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియాలో పెట్టాల‌ని, అలాంటి ప్ర‌జ‌ల ఇళ్ల‌కు వ‌చ్చి వారికి శాల్యూట్ చేస్తాన‌ని క‌మ‌ల హాస‌న్ అన్నారు. ఈ విష‌యంపై ఎవ‌రైనా సోషల్ మీడియాలో త‌న‌కు ట్యాగ్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.

కాగా క‌మ‌ల హాస‌న్ ఈ ఎన్నిక‌ల్లో ద‌క్షిణ కోయంబ‌త్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయ‌న పోటీలో ఉన్న అభ్య‌ర్థులంద‌రికీ విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఇక ఎన్నిక‌లు అంటే క్రికెట్ మ్యాచ్‌ల‌లాంటివ‌ని, ఎన్నిక‌ల్లో గెలిచినా, ఓడినా అక్క‌క‌డితో క‌థ అయిపోద‌ని అన్నారు. ఎవ‌రు గెలిచినా ప్ర‌జా సంక్షేమానికి, ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment