సామాన్యులకు ఊరట.. దిగి రానున్న వంటనూనె ధరలు!

June 30, 2021 8:08 PM

గత కొద్దిరోజుల నుంచి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులపై అధిక భారం పడింది. ఈ క్రమంలోనే వంటనూనె ధర కూడా తారా స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విషయం పై కీలక నిర్ణయం తీసుకుంది.క్రూడ్ పామ్ ఆయిల్‌ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించి 10 శాతానికి తగ్గించింది. దీంతో రిటైల్ మార్కెట్లో వంటనూనెల ధరలు దిగి రానున్నాయి.

మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుధవారం నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సామాన్య ప్రజలకు అధిక ధరల నుంచి ఊరట కలిగించడం కోసమే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్‌ పైన కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతం నుంచి 30.25 శాతానికి తగ్గింది.

అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్ పైన 49.5 శాతం నుంచి 41.25 శాతానికి తగ్గించింది. దీంతో వంట నూనె ధరలు దిగి రానున్నాయని ఈ సందర్భంగా సీబీఐసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు వంట నూనె పై అధిక భారం తగ్గనుందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment