India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు భార‌త‌దేశం

దారుణం.. రైలులో అండర్‌వేర్‌తో ప్రయాణించిన ఎమ్మెల్యే.. తోటి ప్రయాణికులపై బెదిరింపులు.. కేసు నమోదు..

IDL Desk by IDL Desk
Saturday, 4 September 2021, 11:26 AM
in భార‌త‌దేశం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

బీహార్‌కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రైలులో అండర్‌వేర్‌తో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా వారిపై బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ ప్రయాణికుడికి చెందిన బంగారు ఆభరణాలు, నగదును కూడా ఆయన లాక్కున్నారని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో రైల్వే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

దారుణం.. రైలులో అండర్‌వేర్‌తో ప్రయాణించిన ఎమ్మెల్యే.. తోటి ప్రయాణికులపై బెదిరింపులు.. కేసు నమోదు..

బీహార్‌ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ గురువారం పాట్నా నుంచి న్యూఢిల్లీకి తేజస్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే వారు రైలులో సెకండ్‌ ఏసీ ఎ1 బోగీలో 13, 14, 15 నంబర్‌ బెర్తుల్లో ప్రయాణిస్తున్నారు.

అయితే రైలు ఉత్తరప్రదేశ్‌లోని దిల్దార్‌నగర్‌ స్టేషన్‌ను దాటిన తరువాత ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ షర్ట్‌, ప్యాంట్‌ విప్పి కేవలం బన్నీను, అండర్‌వేర్‌ తో రైలులో చాలా సేపు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రవర్తన పట్ల తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పగా వారిపై ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా ఓ ప్రయాణికుడు ధైర్యం చేసి ఆయన్ను ప్రశ్నించగా అతని నుంచి బంగారు చెయిన్‌, ఉంగరం, డబ్బును ఎమ్మెల్యే లాక్కున్నారు.

ఈ క్రమంలో ఆ ప్రయాణికుడు రైల్వే పోలీసులకు పై విషయాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆ సమయంలో ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నాడని కూడా ఆ ప్రయాణికుడు తెలిపాడు. తమను బెదిరించడమే కాకుండా, తన దగ్గర ఉన్న బంగారం, నగదును ఎమ్మెల్యే లాక్కున్నాడని ఆ ప్రయాణికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌పై కేసు నమోదు చేశారు. ఆ కేసును బీహార్‌లోని బక్సర్‌కు బదిలీ చేశారు.

#WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq

— ANI (@ANI) September 3, 2021

కాగా ఆ ఎమ్మెల్యే అలా రైలులో తిరుగుతున్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో అతని ప్రవర్తన పట్ల నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా నీచంగా ప్రవర్తించాడని విమర్శిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై సదరు ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ స్పందిస్తూ.. తనకు ప్రయాణంలో విరేచనాలు అయ్యాయని, అందుకనే అలా అండర్‌వేర్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. కానీ ప్రయాణికులందరూ ముక్త కంఠంతో ఆయనపై ఆరోపణలు చేశారు. తమపై ఆయన బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.

Tags: biharjdu mla gopal mandaltejas expressజేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండ‌ల్‌తేజ‌స్ ఎక్స్‌ప్రెస్బీహార్‌
Previous Post

భార్య భర్తల గొడవలోకి దూరాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

Next Post

ఇకపై ట్వీట్ చేస్తే డబ్బులు.. సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన ట్విట్టర్!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.