9 నెల‌ల కింద అదృశ్యం అయిన మ‌హిళా సీఐడీ ఆఫీస‌ర్‌.. గుడి బ‌య‌ట పువ్వుల‌మ్ముతూ క‌నిపించింది..

September 3, 2021 5:45 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓ షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. 9 నెల‌ల కింద‌ట ఓ మ‌హిళా సీఐడీ ఆఫీసర్ స‌డెన్‌గా క‌నిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎటు వెళ్లిందో ఎవ‌రికీ తెలియ‌లేదు. అయితే ఆమె స‌డెన్ గా ఓ ఆల‌యం బ‌య‌ట పువ్వులు అమ్ముకుంటూ క‌నిపించి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. వివ‌రాల్లోకి వెళితే..

9 నెల‌ల కింద అదృశ్యం అయిన మ‌హిళా సీఐడీ ఆఫీస‌ర్‌.. గుడి బ‌య‌ట పువ్వుల‌మ్ముతూ క‌నిపించింది..

చ‌త్తీస్‌గ‌డ్‌లోని రాయ్‌పూర్‌లో మ‌హావీర్ న‌గ‌ర్‌లో ఉంటున్న అంజ‌నా సాహిస్ సీఐడీ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తోంది. 9 నెల‌ల కింద‌ట ఆమెను రాయ్‌పూర్ పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేశారు. అయితే ఆమె స‌డెన్‌గా క‌నిపించ‌కుండా పోయింది. పోలీస్ అధికారుల‌కు ఆమె ఎటు వెళ్లిందో, ఎక్క‌డ ఉంటుందో తెలియ‌లేదు.

అయితే ఆమె ఏటీఎం లావాదేవీల‌ను వారు ఇటీవ‌ల చెక్ చేశారు. దీంతో ఆమె ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బృందావ‌న్‌లో ఉంటున్న‌ట్లు గుర్తించారు. అక్క‌డ ఆమె ఆల‌యం వ‌ద్ద బ‌య‌ట పువ్వులు అమ్ముకుంటోంది. దీంతో ఆమెను అలా చూసి పోలీసులు షాక‌య్యారు. వారు ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌ళ్లీ డ్యూటీలో చేరాల‌ని అడిగారు. అయితే అందుకు ఆమె నిరాక‌రించింది. త‌న వృత్తి ఇదేన‌ని, తాను పోలీస్ ఆఫీస‌ర్ కాన‌ని, తాను రాలేన‌ని చెప్పింది. అధికారులు ఆమెకు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఆమె ఆల‌యం వ‌ద్దే ఉండ‌సాగింది. అయితే ఆమెకు ఏమై ఉంటుంది ? ఎందుకు అలా ప్ర‌వ‌ర్తిస్తోంది ? ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “9 నెల‌ల కింద అదృశ్యం అయిన మ‌హిళా సీఐడీ ఆఫీస‌ర్‌.. గుడి బ‌య‌ట పువ్వుల‌మ్ముతూ క‌నిపించింది..”

Leave a Comment