Monkeys : దారుణం.. 2 నెల‌ల ప‌సికందును వాట‌ర్ ట్యాంకులో ప‌డేసి చంపిన కోతులు..

January 10, 2022 4:50 PM

Monkeys : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాగ్‌ప‌ట్ అనే ప్రాంతంలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ప‌సికందును కోతులు త‌స్క‌రించి వాట‌ర్ ట్యాంకులో ప‌డేశాయి. దీంతో నీటిలో మునిగిన ఆ చిన్నారి చ‌నిపోయాడు. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న‌కు సంబంధించి.. వివ‌రాల్లోకి వెళితే..

Monkeys dropped 2 months old infant into water tank and killed him

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాగ్‌ప‌ట్ అనే ప్రాంతంలో కేశ‌వ కుమార్ అనే 2 నెల‌ల ప‌సికందును త‌న బామ్మ మంచంలో ప‌డుకోబెట్టుకుంది. వారు భ‌వ‌నం పైన టెర్ర‌స్ మీద ఉన్న అంత‌స్థులో ఓ గ‌దిలో నిద్ర‌పోతున్నారు. ఆ స‌మ‌యంలో ఆ వృద్ధురాలు గ‌ది త‌లుపులు పెట్ట‌లేదు.

ఈ క్ర‌మంలోనే కొన్ని కోతులు అటుగా వ‌చ్చాయి. నిద్రిస్తున్న ప‌సికందును త‌న బామ్మ నుంచి లాక్కుని అక్క‌డే ప‌క్క‌న ఉన్న వాట‌ర్ ట్యాంకులో ప‌డేశాయి. అయితే ఆ వృద్ధురాలికి మెళ‌కువ వ‌చ్చి చూడా.. ప‌క్క‌నే నిద్రిస్తూ ఉండాల్సిన త‌న మ‌న‌వ‌డు క‌నిపించ‌లేదు. దీంతో ఆమె అంద‌రికీ విష‌యం చెప్పింది. వారంద‌రూ చుట్టూ అంత‌టా గాలించారు. చివ‌ర‌కు ఆ పసికందు మృత‌దేహం వాట‌ర్ ట్యాంకులో క‌నిపించింది. దీంతో ఆ కుటుంబం ప‌డుతున్న వేద‌న అంతా ఇంతా కాదు.

అయితే ఈ విష‌యంపై చండీన‌గ‌ర్ స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ ఓపీ సింగ్ మాట్లాడుతూ.. వాస్త‌వానికి ఆ ఏరియాలో కోతుల బెడ‌ద ఎక్కువ‌గా ఉంద‌ని ప్ర‌జ‌ల నుంచి అనేక మార్లు ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని.. ఈ విష‌యాన్ని తాము స్థానిక అట‌వీశాఖ అధికారుల‌కు ఇప్ప‌టికే తెలియ‌జేశామ‌ని.. అయిన‌ప్ప‌టికీ వారు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలిపారు. లేదంటే ఈ ఘాతుకం జ‌రిగి ఉండేది కాద‌న్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now