భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ ప్రభావం విమానయాన సంస్థ పై పడింది.భారత్ లో కేసులు అధికంగా ఉండటంతో ఇప్పటికే పలు దేశాలు ఇండియా నుంచి విమానాల రాకపోకలను నిషేధం విధించారు. ఇప్పటికే యూకే, జర్మన్, యూఏఈ వంటి దేశాలు భారత్ నుంచి విమానాలను నిషేధించారు.ఈ విధంగా పలు దేశాలు విమాన రాకపోకలు పై కఠిన నిబంధనలు విధించడంతో ఈ ప్రభావం అమెరికా వెళ్లే వారిపై పడింది.
ఇప్పటివరకు ఇండియా నుంచి అమెరికా వెళ్ళడం కోసం అమెరికా ప్రభుత్వం విమానాలను నిషేధించలేదు. అమెరికా నిబంధనల ప్రకారం ఇండియా నుంచి అమెరికాకి రావచ్చు కానీ.. అమెరికా నుంచి ఇండియాకు వెళ్లకూడదని అమెరికా పౌరులకు అగ్రరాజ్యం ఆదేశాలను జారీ చేసింది.ఇండియాలో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉండడంతో అమెరికా వెళ్లాలనుకునేవారు ఇప్పుడే అమెరికాకు పయనమవుతున్నారు.
ఈ క్రమంలోనే అమెరికా వెళ్లే విమానాలు రద్దీగా ఉండడంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయి.సాధారణ రోజుల్లో అమెరికా వెళ్లేందుకు టిక్కెట్ ఫేర్ సుమారు రూ.50 వేల వరకూ ఉంటుంది. కానీ రద్దీ కారణంగా ప్రస్తుతం రూ.1.5 లక్షలకు చేరినట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా ట్రావెల్ ఏజెన్సీలు టిక్కెట్ ధరలను మూడు రెట్లు అధికం చేసాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…