ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టి-షర్ట్‌లు వేసుకుని ఆఫీస్‌కు రావడం సరికాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్..

September 11, 2021 5:56 PM

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌ అనే జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ (కలెక్టర్‌) వినీత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్‌, టి-షర్ట్‌లు వేసుకుని ఆఫీసులకు రావడం సరికాదని అన్నారు. అలా వారు చేస్తే డీసెన్సీ ఉండదని, ప్రజల్లోని ఉద్యోగుల పట్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఆయన తాజాగా ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టి-షర్ట్‌లు వేసుకుని ఆఫీస్‌కు రావడం సరికాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్..

అయితే గతంలో ఉధమ్‌ సింగ్‌ నగర్‌కు చెందిన కలెక్టర్‌ కూడా ఇలాగే ఆర్డర్‌ జారీ చేశారు. కానీ దాన్ని అమలు పరిచేలోగా ఆయన బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కలెక్టర్‌ వినీత్‌ కుమార్‌ ఈ విధంగా ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. జీన్స్‌, టి-షర్ట్‌లు వేసుకుని ఉద్యోగులు మీటింగ్‌ హాజరవడం, ఆఫీస్ కు రావడం వల్ల వారి డ్రెస్‌కు హుందాతనం ఉండదని, ఉన్న డీసెన్సీ పోతుందని, ప్రజల్లో చులకన అవుతామని ఆయన అన్నారు. అందువల్ల అందరూ ఫార్మల్స్‌ ధరించాలని సూచించారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌ విధించడం నిజానికి కొత్తేమీ కాదు. బీహార్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేస్తున్నారు. అయితే కలెక్టర్‌ వినీత్‌ కుమార్‌ ఈవిధంగా ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. దీంతో ఆయనను చాలా మంది ప్రశంసిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment