దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ శుభ‌వార్త‌.. ఇక అంద‌రికీ ఉచితంగా కోవిడ్ టీకాలు..

June 7, 2021 5:34 PM

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు శుభవార్త చెప్పారు. దేశంలో అంద‌రికీ కోవిడ్ టీకాల‌ను ఉచితంగా అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన అంద‌రికీ కేంద్ర‌మే ఉచితంగా కోవిడ్ టీకాల‌ను అందిస్తుంద‌ని, కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాలు పైసా ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేద‌ని మోదీ అన్నారు.

free covid vaccine for above 18 years of age persons pm modi announces

క‌రోనా నేప‌థ్యంలో సోమ‌వారం జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని మోదీ పై విధంగా వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర‌మే టీకాల‌ను కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు అందిస్తుంద‌ని, టీకాల కోసం ఎవ‌రూ ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేద‌న్నారు. దేశ ప్ర‌జలంద‌రికీ టీకాలు వేసే బాధ్య‌త కేంద్రానిదే అని అన్నారు.

న‌వంబ‌ర్ వ‌ర‌కు దేశంలోని 80 కోట్ల మందికి టీకాలు వేస్తామ‌ని మోదీ అన్నారు. కోవిడ్ టీకాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అనేక సందేహాలు నెల‌కొన్నాయ‌ని, టీకాలు తీసుకునేందుకు ఎవ‌రూ భ‌య ప‌డాల్సిన ప‌నిలేద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ టీకాను తీసుకోవాల‌న్నారు. టీకాల‌పై ఇత‌రుల‌కు ఉండే అపోహ‌ల‌ను తొల‌గించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని అన్నారు. కోవిడ్ ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. క‌రోనాపై చేస్తున్న పోరాటంలో అంద‌రం విజ‌యం సాధిస్తామ‌ని, భార‌త్ కోవిడ్ పై విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment