నా పొలంలో బావిని దొంగలించారు.. వెతికి పట్టుకోండి అంటూ ఫిర్యాదు చేసిన రైతు.. చివరికి ఇలా?

July 8, 2021 5:02 PM

తన పొలంలో ఉన్నటువంటి బావిని ఎవరో దొంగిలించారని,ఎలాగైనా తన బావిని వెతికి పట్టుకొని తనకు అప్పజెప్పాలని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని ఫిర్యాదుకు పోలీసులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. బాబుని దొంగలించడం ఏంటి దానిని వెతికి పట్టుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే వివరాలలోకి వెళ్లాల్సిందే.

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్‌ పోలీస్ స్టేషన్లో మంగళవారం తనపొలంలో ఉన్న బావిని ఎవరో దొంగిలించారని ఎలాగైనా దానిని వెతికి పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి పోలీసులు ఆరా తీయగా.. గ్రామ పంచాయతీ అధికారులు తన పొలంలో బావిని తవ్వినట్లు రికార్డులు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు. అయితే ప్రస్తుతం భావి తవ్వకానికి తీసుకున్న రుణం వాయిదాల పద్ధతిలో చెల్లించాలంటూ రైతుకి ప్రభుత్వం నుంచి నోటీసులు వస్తున్నాయి.

అయితే ఈ విధంగా నోటీసులు రావడంతో ఎంతో ఆశ్చర్యపోయిన రైతు అసలు విషయం తెలుసుకొని ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా బావి పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఈ విధంగా అధికారులు తన పొలంలో బావి తవ్వినట్లు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడిన విషయం బయట పెట్టాలనే ఉద్దేశంతో రైతు ఈ విధంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment