డబుల్ మాస్క్ ధరించడం పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం..!

May 12, 2021 10:20 PM

కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి.అయితే డబల్ మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని రెండు రెట్లు అరికట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. డబల్ మాస్క్ ధరించడం వల్ల పూర్తిగా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. తాజాగా డబల్ మాస్క్ ధరించడం పై కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

డబల్ మాస్క్ ధరించడం వల్ల వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు.అయితే డబల్ మాస్క్ ధరించేవారు రెండూ ఒకే విధమైన మాస్కులు ధరించకూడదని,ఒకటి రెండు పొరలతో తయారుచేసిన క్లాత్ మాస్క్, మరొకటి సర్జికల్ మాస్క్ ను ధరించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

అదే విధంగా ఒకే మాస్క్ ను రెండు రోజులు వాడకూడదని, క్లాత్ మాస్క్ ను తరుచు ఉతుకుతూ వాడాలి. సర్జికల్ మాస్క్ మాత్రం ఒక రోజే ఉపయోగించాలి. ఈ మాస్క్ ధరించేటప్పుడు పూర్తిగా మన ముక్కు మూతిని కవర్ చేసి ఉంచాలి. ఈ క్రమంలోనే శ్వాస క్రియకు ఆటంకం కలిగించే మాస్క్ లను ధరించకూడదు. డబల్ మాస్క్ ధరించడం వల్ల సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను రెండు రెట్లు సమర్థవంతంగా అడ్డుకుంటుందని పలు అధ్యయనాల్లో నిరూపితమైనది పరిశోధకులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment