కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి.. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అద‌న‌పు వ‌డ్డీని పొందండి..!

April 13, 2021 4:44 PM

దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ 3వ ద‌శ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే 45 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సిన్‌ల‌ను ఇస్తున్నారు. అయితే చాలా మంది భ‌యంతో కోవిడ్ టీకాల‌ను వేయించుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయి. అయితే ప్ర‌జ‌ల్లో వ్యాక్సిన్ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, వారిని టీకాలు తీసుకునేలా ప్రోత్స‌హించేందుకు సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ వినూత్న స్కీమ్‌ను ప్ర‌క‌టించింది.

central bank of india offers additional interest those who take covid vaccine

కోవిడ్ వ్యాక్సిన్ల‌ను తీసుకునేవారికి సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను అందిస్తోంది. టీకాల‌ను తీసుకునే వారు ఆ బ్యాంకులో ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే దానిపై 25 బేసిస్ పాయింట్ల మేర అద‌న‌పు వ‌డ్డీని అందిస్తారు. ఆ బ్యాంకు తాజాగా ఈ స్కీమ్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. దీన్ని ప‌రిమిత కాలపు ఆఫ‌ర్‌గా ఆ బ్యాంకు తెలిపింది. అందువ‌ల్ల కోవిడ్ టీకాలు తీసుకునే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ వేసే ఆలోచ‌న ఉంటే ఆ బ్యాంకులో ఎఫ్‌డీ వేయ‌వ‌చ్చు. దీంతో అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది.

ఇక ఆ ఎఫ్‌డీ కింద వినియోగ‌దారులు క‌నీసం 1,111 రోజుల పాటు అయినా డ‌బ్బును డిపాజిట్ చేయాలి. అప్పుడే అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది. దేశంలో కోవిడ్ టీకాల‌ను తీసుకునేందుకు చాలా మంది సందేహిస్తున్న నేప‌థ్యంలో టీకాల‌ను తీసుకునేలా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకే ఆ బ్యాంకు ఈ స్కీమ్‌ను ప్ర‌క‌టించింది. మ‌రి దీని కింద ఎంత మంది ఎఫ్‌డీల‌ను వేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment